పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సృష్టిక్రమము

వ.

అట్టిశబ్దతత్వంబువలన నాకాశతత్వంబు పుట్టే నయ్యాకాశంబునకు శబ్దంబు
గుణం బయ్యె నాశబ్దంబునకు స్పర్శంబు తన్మాత్రగుణంబయ్యె నాస్పర్శగుణంబు
వలన వాయుతత్వంబు పుట్టె నవ్వాయువునకు రూపంబు తన్మాత్రగుణంబయ్యె
నారూపంబువలన వహ్నితత్వంబు పుట్టె నావహ్నికి రసంబు తన్మాత్రగుణంబయ్యె
నారసగుణంబువలన నుదకతత్వంబు పుట్టె నయ్యుదకంబునకు గంధంబు తన్మాత్ర
గుణంబయ్యె నాగంధంబువలన భూమితత్వంబు పుట్టె నాభూమికి శబ్దాదు
లేనును తన్మాత్రగుణంబులయ్యె నివ్విధంబున.

42


క.

ఈపంచభూతములు దమ, లోపలిశబ్దాదిగుణములు ప్రవర్తింపన్
వ్యాపించి విశ్వమయమై, చూపట్టుట విష్ణుశక్తి చూవె నరేంద్రా.

43


వ.

అట్టిపృథివ్యప్తేజోవాయ్వాకాశంబు లనుభూతపంచకంబును, శబ్దస్పర్శరూపరస
గంధంబు లనుగుణపంచకంబును, త్వశ్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణంబు లనుబుద్ధీం
ద్రియపంచకంబును, వాక్పాణిపాదపాయూవస్థ లనుకర్మేంద్రియపంచకంబును,
మనోబుద్ధ్యహంకారంబులతోడ రాజసతామససాత్వికగుణోద్రిక్తంబుగాఁ బ్రజా
సృష్టి విస్తరిల్లె.

44


ఉ.

ఈవిధమై నిరస్తగతి నేచినయిన్నియు నాదిభూతముల్
గావున నీప్రపంచ మనఁగా నొకదేహము దేహధారి ల
క్ష్మీవసుధాకళత్రుఁ డగుకేశవుఁ డాతఁడు గానివెవ్వియున్
లేవు తదీయకృత్యముల లీలలు సూవె చరాచరస్థితుల్.[1]

45


క.

ఈసకలభూతసర్గ, వ్యాసక్తిం దగిలి విశ్వమంతయుఁ దానై
భాసిల్లు వాసుదేవుఁడు, శ్రీసంపద మెఱసి యేమి చెప్ప మునీంద్రా.[2]

46


క.

ఈయాదిభూతసర్గ, శ్రీయంతయు వాసుదేవుచేత వినోద
ప్రాయమున విస్తరిల్లెఁ జు, మీ యబ్జభవాండసృష్టి యింకను వినుమా.

47


మ.

పరమాత్ముండును బంచభూతమయుఁడున్ బ్రహ్మణ్యుఁడున్ దానయై
హరినారాయణమూర్తి తా ననుపమంబై యొప్పి యంభోధిపై
నురగాధీశ్వరతల్పుఁడై మెఱసి తా నున్నప్పు డాత్మీయమూ
ర్తిరజోవృత్తి వహింప మానసమునన్ దీపించె సర్గక్రియల్.[3]

48


వ.

అంత.

49


మ.

అమలం బై జలబుద్బుదప్రతిమమై యంభోధిలో నొక్కయం

  1. నిరస్తగతిన్ = తడఁబడినవిధముగా, ఏచిన = విజృంభించిన, లక్ష్మీవసుధాకళత్రుఁడు = శ్రీభూములు భార్యలుగాఁ గలవాఁడు.
  2. భూతవర్గవ్యాసక్తిన్ = భూతనృష్టి వ్యాసంగమును, తగిలి =పూని.
  3. బ్రహ్మణ్యుఁడు = వేదోక్తాచారములను నడపువాఁడు. ఉరగాధీశ్వరతల్పుఁడు = శేషుఁడు పాన్పుగాఁ గలవాఁడు, ఆత్మీయమూర్తి = తనదైన ఆకృతి, సర్గక్రియలు = సృష్టి కార్యములు.