పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ్చిన పనులెల్ల నీ విపుడు చెప్పినపల్కులలోఁ బ్రకాశమ
య్యెను జరితార్థులైరి విను మిందఱు నీవలన న్నిజంబుగన్.[1]

325


క.

అని కృష్ణద్వైపాయన, మునివరుఁ బూజించి ప్రమదమునఁ దాపసులె
ల్లను దమతమనెలవులకు, జనిరి తదీయంబు లైనసల్లాపములన్.

326


క.

అని చెప్పి పరాశరుఁ డ, మ్మునిపుత్రునిఁ జూచి పాపములకు నిలయమై
యొనరినకలియుగమందును, ఘన మొక్కటి గలిగియుండి గణనకు నెక్కున్.

327


క.

పరమరహస్యం బీకథ, పరిపాటిగ నీకుఁ దేటపడఁ జెప్పితి నా
హరిసంకీర్తన మఱవక, చరితార్థుం డగుచు నుండు సన్మునితిలకా.

328


మ.

అనినన్ శిష్యుఁడు సంతసం బొదవ నయ్యాచార్యునిం జూచి యి
ట్లనుఁ గల్పాంతమునన్ జగంబుల కపాయం బెమ్మెయిం గల్గు న
వ్వనజాతాయతనేత్రుఁ డెవ్విధమునన్ వర్తించు నా కేర్పడన్
వినుపింపం దగునన్న నాతనికి నవ్విప్రోత్తముం డిట్లనున్.

329

నైమిత్తికప్రాకృతాత్యంతికము లనెడు మూఁడుప్రళయములవివరణము

చ.

అనఘ నిమిత్తమాత్రముననైన పటుప్రతిసంచరక్రియల్
వినుము మహాయుగంబు లొకవేయి చనంగ దినంబునందు న
వ్వనరుహసూతి కప్పు డనివార్యగతిన్ హరి తామసంబు పెం
పొనరఁగ రుద్రరూపమునఁ బొంది భయంకరమై చెలంగినన్.[2]

330


క.

త్రాణలు చెడి దుఃఖంబులు, ప్రాణభయంబులును గలిగి బడలిక లొదవన్
క్షోణిఁ జరాచరచయములు, క్షీణప్రాయంబులై నశించు మునీంద్రా.[3]

331


క.

ఇలపై శతసంవత్సర, ములు వానలు లేక భూతముల నన్నింటిన్
బోలియించు నరాజకములు, గలుగుఁ బ్రజానాశమునకుఁ గారణములుగన్.

332


క.

జలజహితు వేయికిరణం, బులలోపల నధికతీవ్రములు నత్యుష్ణం
బులు నైన యేడురశ్ముల, నలినాప్తుఁడు నిలిచి క్రోలు నానాజలముల్.[4]

333


ఉ.

స్థావరజంగమంబులరసంబులు సప్తసముద్రవాహినీ
గ్రావగతోదకంబులు నగాధరసాతలజీవనంబులున్
ద్రావఁగ నెల్లలోకములు దగ్ధము నొందినయట్ల యుండు న
ద్దేవునిదీప్తు లేడు నవతీర్ణము నొందుఁ బ్రచండమూర్తులై.[5]

334


క.

ఆసప్తప్రళయార్క, వ్యాసమయూఖౌఘతీవ్రవహ్నిజ్వాలా
న్యాసముల మూఁడు జగములు, భూసురపుంగవ వినాశమునఁ బొందుఁ జుమీ.[6]

335
  1. ఏము = మేము, చరితార్థులు = నెఱవేఱిన ప్రయోజనము గలవారు.
  2. తామసంబు = తమోగుణము.
  3. త్రాణ = శక్తి.
  4. రశ్ములన్ = కిరణములచేత, గ్రోలు = పీల్చును.
  5. గ్రావగత = కొండలను బొందిన, జీవనంబు = నీళ్లు, అవతీర్ణమున్ = దిగుటను, ప్రచండమూర్తులు = వేండ్రమైన యాకృతి గలవి.
  6. వ్యాస = విస్తారముగా ప్రసరించిన, న్యాసములన్ = ఉంచుటలచేత.