పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భునిభార్యానివహంబులందు నొకరిన్ బోనీక కొల్లాడినన్
ఘనుఁ డప్పార్థుఁడు గాండివంబు గొని వీఁకన్ నారి యెక్కింపఁబో
యిన దోశ్శక్తి దొలంగివో నబలుఁడై యెంతేని దుఃఖంబునన్.[1]

277


ఆ.

నలిననాభుతోడ నాబాహుశక్తియుఁ, బొలియఁబోలు వనుచు భూరిదివ్య
బాణపూర్ణ మైనతూణీరములు చూడ, నవియు రిత్తలయ్యె నద్భుతముగ.[2]

278


ఆ.

మహితదివ్యబాణమంత్రాధిదేవత, లందునొకఁడుఁ దోఁపదయ్యె మదిని
నమరరాజతనయుఁ డప్పుడు జీవన్మృ, తుండుఁబోలె నుండె దండి వొలిసి.[3]

279


వ.

ఇ ట్లెత్తువడినమత్తమాతంగంబునుంబోలె బలారాతినందనుండు గాండీవంబు
వీచుచు నదల్చుచున్న యతనిం గయికొనక చోరు లన్నవనీతచోరుభార్యలఁ
జెఱలుగొనిపోయి రంత.[4]

280


క.

శ్రీపతిభార్యలఁ గోల్పడి, యాపార్థుఁడు చిన్నవోయి యప్పుడు చనియెన్
ఏఁపున గోవులఁ గోల్పడి, గోపాలకుఁ డరిగినట్లు ఘోరాటవిలోన్.[5]

281


వ.

ఇ ట్లరిగి తనకు నభిముఖుండయివచ్చు కృష్ణద్వైపాయనుం బొడగాంచి విన్ననై
కృష్ణాదియాదవులు పరలోకగతులగుటయుఁ గృష్ణునిభార్యలం గిరాతు లపహరిం
చుటయుఁ దనబలంబు చేవ యడంగుటయుఁ జెప్పిన నమ్మునీంద్రుం డింద్రనందనున
కిట్లనియె.[6]

282


ఆ.

కాలగతుల దైవఘటనల నొక్కొక్క, వేళ నధికుఁ డైనవీరముఖ్యుఁ
డల్పబలునిచేత నవమానమునఁ బొందు, నపుడ వానిబలము నడఁగునొక్కొ.

283


సీ.

మధుకైటభులతోడ మచ్చరంబునఁ బోరి యిందిరాధీశుండు క్రిందుపడఁడె
యొక్కొక్కవేళ రాహుగ్రహంబున కోడి భానుశీతాంశులు పట్టువడరె
వృత్రాసురునితోడి వైరంబునకుఁ గాక బలవైరి భీతుఁడై పాఱిపోఁడె
గంగాతనూజుతో సంగరం బొనరించి పరశురాముఁడు మున్ను పంతమోడె


తే.

ద్రోణభీష్మాదు లగుమేటిదొరలు నీమ, హోగ్రబాణములకుఁ గాక మోటువడరె
వార లెల్లను బాహుగర్వప్రతాప, ఘనులు గా రనవచ్చునే కౌరవేంద్ర.

284


క.

ఒడలెల్ల నేలపాలై, మడియును జన్మంబు లెల్ల మరణము లై యె
ల్లెడలం జెల్లును దీనికి, వడి సుఖదుఃఖములు సెందవలదు కుమారా.

285


క.

హరిభార్యలు బోయలచేఁ, బరిభవమునఁ బొంది కోలుపడి రని మదిలోఁ
బరితాప మొందకుము భూ, సురశాపము మున్ను గలదు సూ వారలకున్.[7]

286

అష్టావక్రచరిత్రము

వ.

అది యెట్లనినం దొల్లి యష్టావక్రుం డనుబ్రాహ్మణుండు హిమనగసమీపంబున

  1. దస్యులు = దొంగలు, వీఁకన్ = కడఁకతో.
  2. రిత్తలు = వట్టివి.
  3. ఒకఁడున్ = ఒకటియును, జీవన్మృతుండు = బ్రతికియుఁ జచ్చినవాఁడు, దండి = బలిమి.
  4. కైకొనక = లక్ష్యపెట్టక, నవనీతచోరు = కృష్ణునియొక్క.
  5. ఏఁపునన్ = సంతాపముచేత.
  6. విన్ననై = చిన్నబోయి, చేవ = సారము.
  7. పరిభవమునఁ బొంది = భంగపడి, కోలుపడిరి = కొల్లగొనఁబడిరి