పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఉ.

ఏమిటి కింతకోపము వహించితి వన్న కుమార రాక్షస
స్తోమముఁ జంపఁగా నకట దోషము చెందదె క్షత్రియోచితం
బీమహనీయకృత్యము మునీశ్వరధర్మము గాదు జీవహిం
సామతు లైనవారలకు పద్ధతి లేమియు నీ వెఱుంగవే.

18


క.

కోపము గల్గినచోటన, పాపము వర్తిల్లుఁ బాపపరులకుఁ గోప
వ్యాపారంబులె తోఁచును, గోపము పాపంబు నొక్కకుదురై నడుచున్.

19


క.

అపవర్గము స్వర్గంబును, దపమును సుకృతంబు యశము ధర్మముఁ బాపున్
విపులక్రోధము గావునఁ, దపసులకుం గ్రోధ మింత దగునే తండ్రీ.[1]

20


తే.

తండ్రిఁ జంపినపగఁ దీర్పఁ దలఁచి యిప్పు, డింత చేసేద విది నీకు నేల వారి
వారికర్మఫలంబు లవశ్యభుక్తి, కారణంబులు గా కెందుఁ గడవవశమె.[2]

21


వ.

కావునఁ బరమశాంతుండవై నిరపరాధులై దైన్యంబుతోడ నున్నరాక్షసుల
రక్షింపు మని యనేకప్రకారంబులం బ్రార్థించుచున్న పితామహువచనంబు
లాదరించి యువసంహృతరక్షస్సత్రుండ నైతి నిట్లు పరమశాంతుండ నైననాపా
లికి దైత్యదానవచోదితుండును మహామునిగణసమేతుండునునై పులస్త్యబ్రహ్మ
వచ్చి మాతాతచేత నర్చితుండై కూర్చుండి నిజకులప్రసూతు లైనరాక్షసుల
యందు నత్యాదరచిత్తుండ నైయున్నన న్నవలోకించి యిట్లనియె.[3]

22


ఉ.

నిష్ఠురకోపమున్ విడిచి నిర్మలశాంతి వహించి తీవు వా
సిష్ఠ భవన్మనోరథవిశేషము లిచ్చెదఁ జెప్పు మిమ్ముని
శ్రేష్ఠులు మెచ్చ నంచు విలసిల్లుచుఁ బల్కిన నేను దేవతా
జ్యేష్ఠతనూజుపాదములు చేరి ప్రణామము చేసి పల్కితిన్.[4]

23


శా.

నాచిత్తంబు నిరంతరంబును పురాణగ్రంథశాస్త్రక్రియా
వైచిత్రిన్ విలసిల్లుచున్నయది భవ్యజ్ఞానసంసిద్ధియున్
వాచామాధురియున్ మహాప్రతిభయున్ వైదగ్ధ్యముం బెంపుతో
నౌచిత్యంబుగ నాకు నిమ్మని పులస్త్య బ్రహ్మఁ బ్రార్థించితిన్.[5]

24


క.

నాకోరినట్ల వర మ, స్తోకంబుగ నిచ్చి బ్రహ్మసూనుఁ డరిగె సు
శ్లోకుఁడు తాతయు నేత, త్ప్రాకామ్యమ కరుణచేసి పలికె సదయుఁడై.[6]

25


వ.

అది కారణంబుగా నమ్మహానుభావులయనుగ్రహంబునం జేసి.

26


చ.

దేవరహస్యకార్యములు దీపము వెట్టినయట్ల వేదవి
ద్యావిషయస్థితుల్ కరతలామలకంబు లనేకధర్మశా

  1. అపవర్గము = మోక్షము.
  2. భుక్తి = అనుభవము, కడవన్ = మీఱుటకు.
  3. ఉపసంహృతరక్షస్సత్రుండను = ఉపసంహరింపబడిన రాక్షససంబంధిపత్రము గలవాఁడు - రాక్షసులను నశింపఁజేయుచున్న సత్రయాగమును నిలిపినవాఁడనుట, నిజకులప్రభూతులఁ = తనవంశమునఁ బుట్టినవారు.
  4. దేవతాజ్యేష్ఠతనూజుఁడు = బ్రహ్మకొడుకు, బ్రణామము = నమస్కారము.
  5. ప్రతిభ = సమయోచితస్ఫురణగలబుద్ధి, వైదగ్ధ్యము = విదగ్ధత - మిక్కిలి నేర్పరితనము.
  6. అస్తోకంబుగన్ = ఘనముఁగా, సుశ్లోకుఁడు = మంచికీర్తి గలవాఁడు, ప్రాకామ్యము = ఐశ్వర్యము.