పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

నుషయు ననిరుద్ధుఁడును గూడియుండుటయును, గయ్యమైనవిధంబు రాక్షసుఁడు నాగ
పాశబద్ధునిగాఁ జేసి బందిగమున, నిడుటయును జెప్పి మునినాథుఁ డేగుటయును.[1]

170

బాణాసురయుద్ధము

క.

ఆమఱునాడు ముకుందుఁడు, రామప్రద్యుమ్ను లుగ్రరణకోవిదు లు
ద్దామగతిఁ గూడి రాఁగ మ, నోముదమున గరుడవాహనుండై యరిగెన్.

171


వ.

ఇట్లు శోణితపురంబున కరిగి బధిరీకృతనిశాచరసైన్యంబయిన పాంచజన్యంబు
పూరించుటయును.[2]

172


మ.

ధరణీచక్రము దిర్దిరం దిరిగె గోత్రవ్రాతముల్ గ్రుంగె భా
స్కరు నశ్వంబులు త్రోవదప్పె నుడుసంఘంబుల్ వెసండుల్లె సా
గరముల్ ఘూర్ణిలె నాకమెల్ల బెదరెన్ గంపించె శేషాహి భీ
కరమై బాణుపురంబులోఁ దొరిఁగె నుల్కాపాతముల్ బెట్టుగన్.[3]

173


వ.

అప్పుడు.

174


ఆ.

దనుజనాథురాజధాని రక్షింపంగ, భూతనాథువలనఁ బుట్టినట్టి
మూడుకాళ్లు తలలుమూడును గల్గిన, జ్వరము వచ్చి తాఁకె సరభసమున.[4]

175


ఆ.

తాఁకి యాజ్వరంబు తనచేతనున్న భ, స్మము సమంత్రకముగఁ జటులవృత్తి
నొఱు లెఱుంగకుండ నురుసత్వనిధియైన, సీరపాణిమీఁదఁ జిమ్మటయును.[5]

176


మ.

జ్వరహస్తప్రవిముక్తభస్మనిహతిన్ సంతాపముం బొంది భీ
కరదావానలరే ఖనంగ మొలయంగా భీతచేతస్కుఁడై
హరి చూడంగ హలాయుధుం డొఱగినన్ హాహానినాదంబు లం
బరభాగంబునఁ బుట్టె దేవతలచేఁ బ్రస్ఫీతమై యెల్లెడన్.[6]

177


ఉ.

అప్పుడు పద్మనాభుఁడు హలాయుధుఁ గన్గొని రోషశోకముల్
కప్పికొనంగ వచ్చి తనకౌఁగిటఁ జేర్చిన యమహాత్ముఁడున్
దెప్పిఱి లేచి యార్చె మఱి దేవతలున్ వినువీథి చక్కటిన్
జొప్పడ నాపురాణపురుషుం గొనియాడిరి తాపసోత్తమా.[7]

178


మ.

పరమాత్ముం డగుశౌరి యప్పు డనలప్రాయంబు మాహేశ్వర

  1. బందిగమునన్ = కారాగృహమునందు.
  2. బధిరీకృత = చెవుడుపఱుపఁబడిన.
  3. గోత్రవ్రాతములు = కొండలసమూహములు, ఉడుసంఘంబులు = నక్షత్రసమూహములు, డుల్లెన్ = రాలెను, ఘూర్ణిలెన్ = కలఁగెను, తొరిఁగెన్ = వర్షించెను, ఉల్కాపాతములు = కొఱవులయొక్క పడుటలు.
  4. భూతనాథువలనన్ = శివునివలన.
  5. చిమ్ముటయున్ =ఎగఁజల్లఁగా.
  6. ప్రవిముక్త = విడువఁబడిన, నిహతిన్ =దెబ్బచేత, రేఖన్ = విధమున, ఒలయన్ = ఆవరింపఁగా, ఒఱఁగినన్ = చొక్కిపడఁగా, ప్రస్ఫీతమై = మిక్కిలి యధికమై.
  7. చక్కటిన్ = సమీపమునందు.