పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కమలాక్ష నీపరోక్షమున నీవృక్షంబు క్రమ్మఱ నాకలోకమునఁ జేరు


ఆ.

ననిన వాసుదేవుఁ డట్ల కాకని యింద్రు, వీడుకొలిపి తరువు వేగ గొనుచు
ధరణి కరుగుదెంచి ద్వారకాపురసమీ, పమున శంఖమొత్తె పటురవమున.[1]

143


వ.

ఇవ్విధంబునం జని యంతఃపురసమీపంబున సత్యభామానివాసంబున భాసిల్లు
నుద్యానవనమధ్యంబునఁ బారిజాతమహీజంబుఁ బ్రతిష్ఠించి నరకాసురపురంబునఁ
దెచ్చిన పదాఱువేలు న్నూర్వురఁగన్యకల నొక్కముహూర్తంబున వివాహం
బయి వారికిం బ్రత్యేకంబ గృహంబులును రమ్యహర్మ్యంబులు నుపవనంబు
లును కేళీజలాశయంబులును పరిచారికాజనంబులును వస్త్రభూషణాదినానా
పదార్థంబులును గొఱంతలేకుండ నొసంగి యవ్విశ్వరూపుం డందఱకు నన్ని
రూపంబులుగాఁ గామకేళీసుఖంబులు సంపాదించుచుండె నంత.[2]

144


తే.

నలిననాభుఁడు నరకకన్యకలయందుఁ, బ్రియతనూజుల ముప్పదిరెండువేల
మీఁద నిన్నూర్వురను గాంచె మేటిఘనుల, వార లత్యంతశౌర్యదుర్వారు లైరి.

145


వ.

మఱియుఁ ప్రద్యుమ్నాదు లయినరుక్ష్మిణీతనూజులును భానుకాదు లయినసత్య
భామాకుమారులును సాంబాదు లయినజాంబవతీపుత్రులును నాగ్నజితీసూను
లయిన భానువిందాదులును సంగ్రామజితాదు లయినశైబ్యాత్మజులును ప్రకా
శాదు లయినలక్ష్మణాపత్యంబులును శ్రుతాదు లయినకాళిందీసుతులును మొద
లుగాఁ గృష్ణుం డెనుబదివేలయొక్కవేలు న్నూర్వురుకుమారులం బడసి లబ్ధ
సంతానుండయి యుండునాకాలంబున.

146


ఆ.

బలితనూజుఁ డైనబాణాసురుఁడు పెక్కు, వేలవత్సరములు నీలకంఠు
నకుఁ దపంబు సేయ నగజాధినాథుండు, మెచ్చి వానియెదుర వచ్చి నిలిచి.[3]

147


వ.

సహస్రబాహుత్వంబును గాణపత్యంబును కౌమారత్వంబును మొదలుగా ననే
కవరంబు లొసంగి మఱియు వానినగరద్వారపాలత్వంబు నియ్యకొని తదీయ
రాజ్యవిభవంబునకు నొకకీడుఁ బొరయకుండ రక్షించుచుండ.[4]

148


క.

బాణుఁడు బాహాశౌర్య, త్రాణపరాయణతతోడ దనుజులు గొలువన్
శోణపురంబునఁ గడున, క్షీణమహీరాజ్యమహిమఁ జేకొని బలిమిన్.

149


మ.

ఆలము గోరి పోయి నసురాంతకుఁ గన్గొని స్వర్గమర్త్యపా
తాళనివాసు లైనబలదర్పసమేతులు వానిడాకకున్
జాలక జాలిఁ బొంది తమసంపదలెల్లను దెచ్చియిచ్చినన్

  1. నీపరోక్షమునన్ = నీకుఁ బిమ్మట.
  2. ప్రతిష్ఠించి = నాటి, జలాశయంబులు =సరస్సులు, సంపాదించుచు = కలుగఁజేయుచు.
  3. నీలకంఠునకున్ = శివునిఁ గూర్చి.
  4. గాణపత్యంబు = ప్రమథగణాధిపతిత్వము.