పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సహస్రరూపంబులయి తన్నుంబొదివిన వానినిజబాణానలంబునకు నింధనంబులు
గాఁ జేసి వెండియు వసురుద్రాదిత్యగణంబుల గంధర్వసిద్ధవిద్యాధరాదియోధ
వీరుల నాయోధనపరాఙు్ముఖులం జేసి వెండియు.[1]

136


క.

వినతాతనయుఁడు తుండం, బున ఱెక్కలచేత నఖరముల రిపుసేనన్
దునిమి యణంచియుఁ జించియుఁ, బెనుపీనుఁగుపెంటఁ జేసె భీషణవృత్తిన్.[2]

137


మ.

అంత బలాంతకుండు సముదంచితబాహుబలప్రతాపదు
ర్దాంతతగతి సితద్విపకులాధివు నెక్కి నిలింపనేనతో
నెంతయుఁ దీవ్రకోపమున నేగి సముద్ధతశక్తితోడఁ గం
సాంతకుమీఁద వైచె సముదగ్రరుచుల్ వెలుఁగొంద వజ్రమున్.[3]

138


వ.

అమ్మహనీయసాధనంబు మాధవునియందుఁ గృతఘ్నునకుం జేసినయుపకారంబు
నుంబోలె నిష్ఫలంబయ్యె నంత నమ్మహితుండు సకలసాధుసుదర్శనం బయినసుద
ర్శనంబు గైకొనిన సకలభూతంబులు హాహాకారంబుల నాక్రోశించుచుండె నంత
నింద్రాణి భయాకులితమానసయై సకలశరణాగతరక్షణదక్షుం డగుపుండరీకాక్షు
నకు వినయవినమితోత్తమాంగ యగుచు నిట్లనియె.[4]

139


ఉ.

దేవ ముకుంద కృష్ణ జగతీధర కేశవ వాసుదేవ పు
ణ్యావహ పద్మనాభ జలజాయతలోచన వాసుదేవ యీ
దేవవరేణ్యుతప్పులు మదిన్ బరికింపక భర్తృభిక్ష నా
కీవలయు జుమీ యనుచు నెంతయు మ్రొక్కుచు విన్నవించినన్.

140


ఉ.

శౌరి పులోమజావిమలసంస్తుతు లెంతయు నాదరించి పెం
పారెడుచల్లచూపుల సురాధిపునిన్ గడు నాదరించి నీ
వీరస మెత్తి యీపనికి నేటికి వచ్చితి వింద్ర నాకు నీ
భూరుహ మిచ్చినం దఱిఁగిపోయెడినే భవదీయసంపదల్.[5]

141


మ.

పురుహూతా విను పారిజాతకుసుమంబుల్ సత్యభామామనో
హరముఁల్ గావున నిమ్మహీజము మదీయద్వారక నిల్పి యీ
యరవించాననకోర్కి దీర్చెద మహాత్మా దీనికై నీవు కో
పరసావేశముఁ జెంద నేటికి నిలింపప్రేరితోద్యోగి వై.[6]

142


సీ.

అనుటయు దేవేంద్రుఁ డంబుజాక్షునిఁ జూచి యీపారిజాతమహీరుహంబు
నధమలోకం బగునట్టిమర్త్యమునకుఁ గొని చన్న నిన్ను నే మనఁగవచ్చు
నైనను నీపత్ని యగుసత్యభామకుఁ బ్రీతి గావున నిది పెద్ద లెస్స

  1. భల్ల = బల్లెము, చటుల = భయంకరులైన, శుద్ధాంతకాంతా = అంతఃపురస్త్రీలయొక్క, శూన్యము = లేకుండఁ జేయునది, కురిసి = కురియించి, నిరవకాశంబు = ఎడము లేనిది, దేవతాలోకంబు = దేవతలసమూహము, అడరించిన = ప్రయోగించఁగా, ఆయోధన = యుద్ధమునకు.
  2. తుండబున = ముక్కుచేత.
  3. సితద్విషకులాధిపున్ = వెల్లయేనుఁగును, నిలింపసేనతోన్ = దేవతాసైన్యముతో.
  4. ఆక్రోశించు = మొఱపెట్టు, ఇంద్రాణి = ఇంద్రునిభార్య, వినయవినతోత్తమాంగ = అడఁకువచేత మిక్కిలి వంపఁబడినశిరస్సు గలది.
  5. ఈరసమెత్తి = ఈర్ష్య కలిగి.
  6. మనోహరములు = ఇంపైనవి.