పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

వనరక్షకు లడ్డముగాఁ, జనుదెంచి ముకుందుఁ గాంచి శతమఖుసతి గై
కొనఁగఁదగు దీనిపువ్వులు, మనుజసతులు ముడువ నర్హమా తలపోయన్.

127


మత్తకోకిల.

నీకు దేవధనంబు లేటికి నిర్జరేంద్రుఁడు విన్నఁ జీ
కాకు సేయక కొంచుఁబొమ్మని గారవింపఁడు గావునన్
నాకవల్లభుతోడ మైత్రి యొనర్పఁగోరెదవేని యీ
పోకలెల్లను మాని నెమ్మదిఁ బొమ్ము నీవని పల్కినన్.[1]

128


క.

వనజనయనుఁ డొండేమియు, ననక నగుచు నూరకుండె నాదిత్యుల కి
ట్లను సత్యభామ భావము, మనమునఁ బెనఁగొనఁగఁ గఱుకుమాటలతోడన్.[2]

129


క.

ఎక్కడిదేవేంద్రుఁడు మఱి, యెక్క డిపోలోమి వీరి కీభూజాతం
బెక్కడి దీలోకములో, నెక్కుడు వీరేల యైరి యెవ్వరికంటెన్.[3]

130


తే.

జలధిఁ బుట్టిన యీపారిజాతవృక్ష, మఖిలలోకములకు సమ మదియుఁ గాక
నామగఁడు శౌరి మీశచీనాథుకంటె, బల్లిదుండౌట యెఱుఁగరె యెల్లవారు.

131


క.

నామగఁడు సకలలోక, గ్రామణి దేవేంద్రుఁ డాదిగాఁ గలదివిజ
స్తోమములు గొలువనుండుట, యేమీ పౌలోమి యెఱుఁగదే మఱచెనొకో.

132


క.

తనమగఁడు బాహువిక్రమ, ఘనుఁ డయ్యెడు నేనిఁ గృష్ణుఁ గయ్యములో మా
ర్కొని గెలిచి పారిజాతము, గొనిపోవుంగాక యేల గొణుఁగులు తనకున్.

133


క.

అనుసత్యభామపలుకులు, విని వనరక్షకులు పోయి విబుధేశకులాం
గన యైనశచికిఁ జెప్పినఁ, గినియుచు నద్దేవి వజ్రకిం జెప్పుటయున్.[4]

134


మ.

దివిజాధీశ్వరుఁ డంత్యకాలశిఖిలీలన్ మండుచున్ దేవతా
నివహంబుల్ రథపత్తివారణహయానీకంబుతోఁ గొల్చి రా
నవలీలన్ జనుదెంచి యాదవకులాధ్యక్షున్ వెసం దాఁకినన్
బవరం బచ్చట నయ్యె నింగియును భూభాగంబుఁ గంపింపఁగన్.[5]

135


వ.

ఇట్లు దలపడి ఖడ్గపరశుకుంతప్రాసతోమరగదాచక్రకచభల్లపరిఘాదిసాధనంబులు
బెట్టిదంబులుగాఁ బ్రయోగించిన సళలశత్రుమర్దనుం డైన జనార్దనుండు చటుల
దనుజశుద్ధాంతకాంతావిభవశూన్యం బయినపాంచజన్యంబు ఘోషంబుచేత
దిశలనెల్లఁ బ్రతిశబ్దంబు గల్పించి శార్ఙ్గంబు గుణధ్వని చేసి శతసహస్రాయుత
నిశాతసాయకంబులు గురిసి యాకాశంబు నిరవకాశంబుఁ జేసిన నాదైవతలోకం
బు తమతమశస్త్రాస్త్రంబులు దివ్యమంత్రపూర్వకంబులుగా నడరించిన నవి బహు

  1. చీకాకు = గాసి, నాకవల్లభుతోడన్ = ఇంద్రునితో, పోకలు = చేష్టలు.
  2. ఆదిత్యులకున్ = దేవతలతో, కఱకు = కఠినములైన.
  3. పౌలోమి = శచి, ఎవ్వరికంటెన్ = ఎల్లవారికంటెను.
  4. కినియుచున్ = కోపగించుకొనుచు.
  5. శిఖి = అగ్ని, బవరంబు = యుద్ధము, నింగి = ఆకాశము.