పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బెద్దదడ వింద్రుఁడును దానుఁ బ్రొద్దుపుచ్చి
కుండలము లదితి కర్పింపఁగోరి యపుడు.

111


చ.

అనఘ సితాద్రిశృంగశిఖరాకృతి నెంతయుఁ జూడ నొప్పు న
య్యనిమిషమాతయున్నయెడ కాహరితో హరి కూడి వచ్చి పెం
వునఁ బ్రణమిల్లి యవ్వెలఁది భూరిసుధామయకుండలద్వయం
బనుపమలీల నిచ్చి నరకాసురుచావు నెఱుంగఁ జెప్పినన్.[1]

112


క.

ప్రీతాత్మ యగుచు నిర్జర, మాత జగన్నాథుఁ డైనమధుసూదను వి
ఖ్యాతచరిత్రునిఁ ద్రిజగ, త్పూతాత్మునిఁ జూచి హర్షమున నిట్లనియెన్.

113


సీ.

భూతేశ భూతాత్మ భూతనాథస్తుత సర్వేశ సర్వజ్ఞ సర్వవినుత
నిర్ద్వంద్వ నిశ్చల నిగమార్థగోచర యవ్యయ యచ్యుత యాదిదేవ
త్రిదశనాథ త్రిలోకదేవ త్రివిక్రమ పరమ పరాపర పరహితార్థ
కమలా కమలేశ కమలరాశినివాస నరసింహ నరవంద్య నరకదమన


తే.

భక్తరక్షణ భవనాశ భవ్యరూప, నిగ్రహానుగ్రహవిధేయ నిత్యనిపుణ
కరుణతో నన్ను రక్షించి కావు మనుచు, భక్తితోఁ గొనియాడె నప్పరమసాధ్వి.[2]

114


తే.

అర్థితోఁ గల్పవృక్షంబు నాశ్రయించి, యల్పదానంబు కౌపీన మడిగినట్లు
నాడు నిన్ను దయార్ద్రమానసునిఁ జేసి, కొడుకుగాఁ గోరితిని ముక్తి గోరలేక.[3]

115


చ.

అనుటయు దేవమాతవదనాబ్జమునం దనచూడ్కి నిల్ఫి యా
ననమున మందహాసము పెనంగఁగ నిట్లనుఁ దల్లి యివ్విధం
బునఁ బలుకంగ నేమిటికిఁ బుణ్యచరిత్రవు దేవమాతవై
ఘనత వహించి పుణ్యమును గాంచితి మోక్షము నీకుఁ బెద్దయే.

116


వ.

అని పలుకుసమయంబున శచీదేవి సత్యభామం దోడుకొనివచ్చి యదితిం బొడ
గానిపించిన నద్దేవియుఁ గోడలి నాదరించి యిట్లనియె.

117


ఆ.

ముదిత మత్ప్రసాదమున సార్వకాలంబు, ముదిమియును విరూపమును దొలంగి
సంతతానవద్యసౌభాగ్యమూర్తివై, యుల్లసిల్లు మనుచు నొసఁగె వరము.[4]

118


క.

తదనంతరంబ సురపతి, యదితియనుమతమున యాదవాధీశుని స
మ్మద మొప్ప వీడుకొలిపినఁ, గదలెన్ గృష్ణుండు ద్వారకాపురమునకున్.

119


వ.

ఇట్లు సత్యభామాసమేతుండై గరుడారోహణంబు చేసి చనునప్పుడు అనవరత

  1. సితాద్రి = వెండికొండయొక్క, హరితో = ఇంద్రునితోఁగూడ, పెంపునన్ = గౌరవముతో.
  2. భూతనాథస్తుత = శివునిచే నుతింపఁబడినవాఁడా, నిర్ద్వంద్వ = సుఖదుఃఖములు మొదలైన ద్వంద్వములు లేనివాఁడా, నిగమార్థగోచర = వేదార్థములయందు కనఁబడువాఁడా, అవ్యయ = నాశరహితుఁడా, త్రిదశనాథ = దేవతలకు ప్రభువైనవాఁడా, పరాపర = మాయాతీతుఁడా, పరహితార్థి = పరులమేలు కోరువాఁడా, నిత్యనిపుణ = శాశ్వతమైన నేర్పుగలవాఁడా.
  3. అర్థితోన్ = కోరికతో.
  4. అనవద్య = నింద్యముగాని, సౌభాగ్య = సౌందర్యముగల.