పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

హరిఁ జంపక కుండినపురిఁ, జొర ననుచుఁ బ్రతిజ్ఞ సేసి శూరతతో నా
సరసీరుహలోచను ని, ర్భరశక్తిం దాఁకి బాహుబల మేపారన్.

61


మ.

తురగస్యందనపత్తివారణములం దోడ్తోడ మేకొల్పి యా
హరితోడన్ బటుఘోరసంగరము సేయం బూనినన్ యాదవే
శ్వరచూడామణి శాతబాణముల నాసైన్యంబు దైన్యంబునన్
బొరయంజేసి విరోధిఁ బట్టుకొని సొంపుందెంపు నేపారఁగన్.[1]

62


క.

ఆవనిత చూచుచుండఁగ, వావిరియై పాఱవాతి వాఁడిశరమునన్
బావా మేలము సూ యని, ఱేవులుగా నతనితల గొఱిగి పోవిడిచెన్.[2]

63


తే.

ఇట్లు విజయంబు గైకొని యేగుదెంచి, ద్వారకానగరమున నాతలిరుబోణి
రాక్షసవివాహమున నభిరామలీలఁ, బరిణయం బయ్యె జగములు ప్రస్తుతింప.

64

ప్రద్యుమ్నానిరుద్ధాదులచరిత్రములు

క.

ముదమున నాలలితాంగికి, నుదయించెను రూపవైభవోపేతుండై
మదనాంశమున విరోధి, ప్రదమనుఁ డగుధర్మమూర్తి ప్రద్యుమ్నుఁ డనన్.[3]

65


సీ.

అతఁడు జన్మించిన యాఱవదినమున శంబరుం డనఁగ రాక్షసవరుండు
తనకు నాబాలుచేతను జావు గలదని యశరీరి పలికిన యర్థరాత్ర
సమయమునం దరిష్టముఁ జొచ్చికొనిపోయి వనరాశిలోఁ బాఱవైచుటయును
మీన మామిషబుద్ధి మ్రింగె జాలరి దానిఁ బట్టి యాదైత్యునిపట్టి కిచ్చి


తే.

చనియె నాయింతియును జలచరము దఱుగు, నపుడు ప్రాణంబుతో నున్నయట్టి శిశువుఁ
జూచి వెఱఁగందుచున్న యచ్చోటి కమర, మౌని యగునారదుఁడు వచ్చి మంతనమున.[4]

66


మ.

హరికిం బుత్రుఁడు వీఁడు వీనిఁ బ్రమదం బాఱంగ రక్షింపుమీ
యరవిందానన యంచుఁ జెప్పుటయు నయ్యబ్జాక్షి యౌఁగాక యం
చు రహస్యంబునఁ జెప్పినన్ తెలిసి రక్షోనాథుఁ డవ్వీరునిన్
బరిమార్పన్ సమకట్టి తాను మడిసెన్ బ్రద్యుమ్నుచేఁ బోరిలోన్.

67


ఉ.

ఆవసుదేవపౌత్రునిమహత్త్వముఁ గన్గొని యామృగాక్షి మా
యారతి పుష్పసాయకశరాహతి నొంది తదీయరూపరే
ఖావిభవంబు మెచ్చుచును గ్రక్కున మేఘపథంబునందు ల
క్ష్మీవిభుఁ డేలు ద్వారవతికిన్ జని యంతిపురంబులోపలన్.[5]

68


ఉ.

వాలినఁ గృష్ణభార్య లగువారిరుహానన లద్భుతక్రియా

  1. పత్తి = పదాతి, మేకొల్పి = పూనుకొనునట్లు చేసి.
  2. వావిరి = ధూర్తుఁడు, మేలము సూ = ఎగతాళి సుమీ.
  3. ప్రదమనుఁడు = చక్కగా నణఁగఁగొట్టువాఁడు.
  4. అరిష్టము = పురిటిల్లు, వనరాశిలోన్ = సముద్రమునందు, అమామిషబుద్ధి = మాంసమను తలంపున, జాలరి = చేఁపలను బట్టువాఁడు.
  5. మేఘపథంబునందున్ = ఆకాశమార్గమునందు.