పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

వసుదేవుఁదేవకీవనితనుఁ జెఱసాల నునుపుఁడు మాతండ్రి నుగ్రసేనుఁ
దల నఱకుఁడు నందుఁ దక్కినగోపులనెల్లను సంకిళ్ల నిడి తదీయ
గోధనంబుల నెల్ల గొల్లలాడుఁడు యదువృష్ణిభోజాంధకవీరవరుల
గొఱ్ఱుల నిడుఁడు గ్రక్కున నేను బలభద్రకృష్ణులఁ బోనీక గీటణంతు


తే.

ననుచు సంభ్రమించి ఘనవాద్యరవములు, మొరయకుండఁజేసి కరితురంగ
రథపదాతిచయము రావించుచున్న యా, కన్నెఱింగి కోపకలితుఁ డగుచు.[1]

413

శ్రీకృష్ణుండు కంసుని సంహరించుట

మ.

లలి మీఱన్ హరి కంసుమంచమునకున్ లంఘించి యమ్మేటియు
జ్జ్వలమాణిక్యకిరీట ముర్వరపయిన్ జాఱన్ శిరోజాతముల్
బలిమిం బట్టి వెసన్ బడందిగిచి లీలన్ వక్షమున్ మస్తమున్
నలియం బెట్టుగఁ గుప్పిగంతుగొని విన్నాణంబు గావించినన్.[2]

414


వ.

ఇట్లు విచిత్రంబుగా సకలలోకవిధ్వంసుం డైనకంసుండు ప్రాణపరిత్యాగంబు
చేసె నప్పుడు.[3]

415


క.

కురిసెన్ బువ్వులవానలు, మొరసెన్ సురదుందుభులు సముజ్జ్వలమహిమన్
బెరసెన్ గంధర్వనుతుల్, సరసన్ వినువీథియందు సంభ్రమములతోన్.[4]

416


క.

అవలీలను బలభద్రుఁడు, బవరంబునఁ గంసుననుజుఁ బరిమార్చినయా
దవవరులును నందాదులు, నవిరళసంతోషహృదయులైరి మునీంద్రా.

417


ఆ.

అంత రామకృష్ణు లవ్వసుదేవదే, వకులకడకు వచ్చి వారిపాద
పంకజాతములకుఁ బ్రణమిల్లుటయు వేడ్క, గౌఁగిలించి హర్షకలితు లగుచు.

418


వ.

కరంబులు మొగిచి నిలిచి యిట్లనిరి.

419


సీ.

అనిమిషాసురకోట్లకైన నసాధ్యంబు లైనయంతేసికార్యములు మీరు
చిఱుతప్రాయంబునఁ జేయుట లెంతయు నద్భుతంబులు పుట్టినట్టి మీరు
పరమపూరుషు లబ్జభవముఖ్యులకుఁ దండ్రియగు వాసుదేవునియపరమూర్తు
లగుమిమ్ముఁ బుత్రకు లనుచు మోహావేశమతులఁ జెందితిమి మీమాయవలన


తే.

నిట్టి మాయపరాధంబు లెల్ల మఱచి, కరుణ మెఱయ రక్షింతురు గాక యనుచుఁ
బరమవిజ్ఞానచిత్తులై భక్తినున్న, తల్లిదండ్రులఁ జూచి యాధన్యమతులు.

420


వ.

పెద్దయుం బ్రొద్దు గొనియాడి రప్పుడు కృష్ణుండు కృతాంజలియై మీరిట్లు పలు
కుట కర్తవ్యంబు గాదు మాయందుఁ బుత్రస్నేహంబు పాటించి గారవింతురు
గాక యనుచు వారివివేకంబు గప్పునట్లుగాఁ దనమాయాయావనికచేత నాచ్ఛా

  1. కన్ను = జాడ.
  2. శిరోజాతములు = తలవెండ్రుకలు, మస్తమున్ = తలయును.
  3. విధ్వంసుఁడు = చెఱుచువాఁడు.
  4. బెరసెన్ = వ్యాపించెను, సరసన్ = సమీపమునందు.