పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

మఱియును.

338


క.

కైలాసనగమునందును, గ్రాలెడు ప్రావృట్పయోధరముచందమునన్
లాలితకటిభాగంబున, నీలాంబర మమరు రామునిం బొడగాంచెన్.[1]

339


వ.

ఇవ్విధంబున నయ్యిరుపురం బొడగాంచి యక్రూరుండు.

340


మ.

భగవంతుం డగువిష్ణుదేవుఁడు మహీభారంబు వారింపఁగా
జగతీమండలి రామకృష్ణు లనఁగా జన్మించె నీమూర్తులై
జగదేశస్తుతిపాత్రులన్ భువనరక్షాదక్షులన్ సంతసం
బిగురొత్తం గనుఁగొంటి నాకొదవేకాదే జన్మసాఫల్యముల్.

341


వ.

అని తలంచి దంతురీభూతపులకితశరీరుండై రథంబు డిగ్గి వినయసంభ్రమభక్తి
తాత్పర్యంబులు చిత్తంబునం బెనంగొన వచ్చి దామోదరునకు సాష్టాంగదండ
ప్రణామంబు చేసిన.[2]

342


క.

బలి యవనిదానధారా, జలములు చిలికించి యతని శతమన్యునిగాఁ
నిలిపి కులిశాబ్జరేఖలు, గలశ్రీహస్తములు నెత్తి కౌఁగిటఁ జేర్చెన్.[3]

343


వ.

తదనంతరంబ గాందినేయుండు రౌహిణేయునకు నభివాదనంబు చేసిన నతండును
నట్ల గారవించి కుశలం బడిగి యర్హప్రకారంబుల మన్నించి యాత్మీయమంది
రాంగణంబున నొక్కరమ్యప్రదేశంబున నమ్మువ్వురుం గూర్చుండి యిష్టసల్లాపం
బులు సేయుచుండి తగుతెఱంగున మజ్జనభోజనంబులు దీర్చి పథశ్రాంతివలననైన
బడలిక తమకరుణామృతసేచనంబుల నపనయించి యతనితోడ మధురాపురం
బునఁ బుట్టినవిశేషంబు లడుగుటయుఁ జక్రధరునకు నక్రూరుం డిట్లనియె.[4]

344


తే.

నీవు సర్వజ్ఞమూర్తివి నీకుఁ దెలివి, పడని యదియేమి యున్నది పద్మనాభ
యయిన నావిన్నపం బెల్ల నాదరించి, వినుము నీచిత్త మటమీఁదిపనులు నడప.

345


వ.

అని పలికి కంసుండు నారదప్రచోదితుండై యాదవసభామధ్యంబున దేవకీవసు
దేవుల నుదాసీనంబు లాడుటయు పితృగౌరవంబు విచారింపక యుగ్రసేనుని
నిగళప్రాప్తునిం జేసి కారాగృహంబున నునుచుటయును తనతోడ బంధుద్రోహం
బు సేయ విచారించుటయు నద్దురాత్మునిదుర్మంత్రంబున నుపాయనంబులు గొని

  1. ప్రావృట్పయోధరము = వానకాలపుమబ్బు.
  2. దంతురీభూత = ఎగుడుదిగుడుగా నైన.
  3. శతమన్యునిఁగాన్ = ఇంద్రునిగా, కులిశాబ్జరేఖలు = వస్త్రమువలెను కమలమువలెను కనఁబడుగీఱలు.
  4. గాందినేయుండు = అక్రూరుఁడు, అభివాదనంబు = నమస్కారము, పథఃశ్రాంతి = మార్గశ్రమము, సేచనంబునన్ = తడుపుటచేత, అపనయించి = పోఁగొట్టి.