పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అఖిలభూతమయుం డైనయమ్మహాత్ముఁ, డనిలమునుబోలె సకలమునందు నుండుఁ
గాన గోపాంగనలతోడఁ గలసి రతులు, సలిపె లోకాపవాదంబు గలుగకుండ.

302


వ.

ఇవ్విధంబున వినోదించుసమయంబున.

303

అరిష్టాసురవధ

సీ.

మీఱిన క్రొవ్వాఁడికోఱకొమ్ములపుట్ట లాడ కాడకును గోరాడియాడి
కడునుబ్బునను గణింగని ఱంకె వేయుచు ధరణీతలము కాలఁ ద్రవ్వి త్రవ్వి
కాలాహికంటె భీకరమైరవాలంబు దిక్కులు కంపింపఁ ద్రిప్పి త్రిప్పి
చటులతరస్కంధసంఘర్ష ణంబున తోడమ్రాఁకులు గూలఁ ద్రోచి త్రోచి


తే.

నీలమేఘంబుకైవడిఁ గ్రాలుచున్న, రూపమున భీకరాకృతి చూపి చూపి
వృషభరూపంబు గైకొని వెస నరిష్టుఁ, డేపుతో గోకులంబున కేగుదెంచె.[1]

304


క.

కంజాకరంబుఁ జొచ్చిన, కుంజరమునుబోలెఁ బసులగుంపులలో లీ
లం జొచ్చి గోగణంబుల, భంజించుచునుండె నధికభయదాకృతితోన్.[2]

305


వ.

అప్పు డాభీరవరు లత్యంతభయాకులమానసులై మొఱవెట్టుచుఁ గృష్ణుని
మఱుంగు పొచ్చినం గరుణించి.

306


మ.

హరి గోపాలుర నోడకుండుఁడని కోపాటోపసంపీడితా
ధరుఁడై యావృషభాసురుం గదిసి యుద్యద్ఘోరహుంకార ము
ద్ధురతన్ జేసిన కృష్ణుకుక్షిపయి దైత్యుం డుద్ధతిన్ గ్రుచ్చినన్
మురవిధ్వంసి నిశాచరాధముని కొమ్ముల్ పట్టి బిట్టార్చుచున్.

307


ఉ.

మిక్కుట మైనతీవ్రమున మింటిపయిన్ వెసఁ ద్రిప్పి నేలతో
నుక్కణఁగంగ వైచుటయు నొక్కట ముక్కున నోర నెత్తురుల్
గ్రక్కుచుఁ బ్రాణముల్ విడిచెం గంజదళాక్షునిఁ జూచి గోపకుల్
మ్రొక్కుచు హస్తపద్మములు మోడ్చి నుతించి రనేకభంగులన్.[3]

308


క.

హరి బిట్టుగిట్టి చంపెను, బరమమునివ్రాతశాపపన్నగదష్టున్
సురసంఘస్ఫీతరిష్టున్, దురహంకృతచేష్టు లోకదుష్టు నరిష్టున్.[4]

309

కంసుండు నారదువలన రామకృష్ణులప్రభావము విని సహింపక ధనుర్యాగవ్యాజంబున వారల మధురకుఁ దోడ్కొని రమ్మని యక్రూరు నంపుట

వ.

అంత నొక్కనాఁడు నారదుండు కంసుపాలికిం బోయి యతండు చేయుసత్కారం
బులు వడసి యతనితోడ వైష్ణవాంశంబుల దేవకీదేవియందు రామకృష్ణులు

  1. కోరకొమ్ములన్ = మీఁదికి నిక్కిన కొమ్ములతో, స్కంధసంఘర్షంబునన్ = మూఁపురాపిడిచేత, క్రాలు = ప్రకాశించు.
  2. కంజాకరంబు = తామరకొలను, కుంజరము = ఏనుఁగు.
  3. తీవ్రమునన్ = వాఁడిమితో, ఉక్కణఁగంగన్ = చావ.
  4. దష్టున్ = కఱవఁబడినవానిని, సురసంఘస్ఫీతరిష్టున్ = దేవతాసమూహమునకు మిక్కుట మైనకత్తి యైనవానిని.