పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జీవనంబు నడుప మావులే దైవంబు, లనుచు నుండువార మగుటఁ జేసి.[1]

229


వ.

అన్వీక్షత్రయీవార్తాదండనీతులను విద్యాచతుష్టయంబునందు వార్త యను
విద్య కృషివాణిజ్యగోపాలనంబులవలనను వృత్తిత్రయాశ్రయంబై యుండు కర్షకు
లకు గృషియును విపణిజీవులకు వాణిజ్యంబును మనకు గోపాలనంబును బరమ
వృత్తులగు నీమూడుదెఱంగులవారికిం తమతమవృత్తులే పరమదైవంబులగు
నవియె వారికి పూజనీయంబులయి యభీష్టఫలంబుల నొసంగుచుండు.[2]

230


ఆ.

తనకు నిష్టమైనదైవంబు కృపచేత, బ్రతికి యన్యదైవభజన సేయు
వార లిందు నందు వరపుణ్యహీనులై, పొలిసి తమ్ముదారె పోదు రనఘ.[3]

231


ఆ.

సీమ యగును పైరు చేసినచోటెల్ల, నందు నుండి యయ్యె నడవిబీడు
శాసనాంత మది కటకంబులును బర్వ, తములు మనకుఁ బరమదైవతములు.[4]

232


తే.

ఇల్లు ముంగిళ్లు మొదలుగా నెల్లవియును, విడిచి పక్షులకైవడి నడవులందుఁ
గొండలందును వర్తించుచుండు మనకుఁ, బరమదైవంబు లగుఁ గదా పర్వతములు.

233


ఉ.

కొండలు కామరూపములఁ గ్రమ్మరుచున్ విపినాంతరంబులం
దుండుమహాపరాధుల వనౌకసులం జటులోగ్రగండభే
రుండగజేంద్రదుష్టమృగరూపములన్ వధియించుసజ్జనుల్
నిండినభక్తిఁ గొల్చినను నెక్కొనఁజేయు ననేకభాగ్యముల్.[5]

234


క.

కావునఁ బర్వతములకును, గోవులకుఁ బ్రియంబు గాఁగఁ గోరి మఘంబుల్
గావింత మెన్నివిధముల, భావించిన నింద్రుతోడి పని మన కేలా.

235


ఆ.

భూసురులకు మంత్రపూజలు హలపూజ, కర్షకులకు గోనికాయశైల
పూజ మనకు నధికపుణ్యఫలంబుల, నొసఁగు విపినచరుల కొండు వలదు.[6]

236


వ.

కావున నొండువిచారంబులు విడిచి మీరు సర్వఘోషసమేతంబుగా గోవర్ధన
శైలంబునకు నుత్సవంబు సాటించి గాటంబుగా వేఁటలం జంపి బహుప్రకారం
బులయినపూజలతోడ జాతరలు చేసి యాగమోక్తప్రకారంబున హోమ
కృత్యంబు నిర్వర్తించి పాయసాపూపవ్యంజనరంజితంబులుగా బ్రాహ్మణులకు

  1. విపణివర్తకంబుచేతన్ = బజారుబేరముచేత.
  2. వృత్తులు = జీవనోపాయములు, పూజనీయంబులు = పూజింపఁదగినవి.
  3. భజన = సేవ, పొలిసి తమ్ముఁదారె పోదురు = తమకుఁదామే నశింతురు.
  4. సీమ = దేశము, అద్రికటకంబులు = కొండనడుములు.
  5. కామరూపములన్ = ఇష్టమువచ్చినయాకారములతో, వనౌకసులన్ = వనమునం దుండువారిని, చటులోగ్ర = కఠినములును భయంకరములు నైన, నెక్కొనన్ = నిలుకడనొందు.
  6. విపినచరులకున్ = అడవియందు మెలఁగువారికి, ఒండు = ఇతరము.