పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


షణంబు సేయుచుండె నిట్లు తాళవనంబు నిష్కంటకంబు చేసి దైత్యకంటకు
లచ్చటం బసులగుంపుల నింపుల మేపుచుఁ దాళఫలంబులు సమస్తజనులకుఁ
జూఱలు విడిచి యిష్టవినోదంబులం దగిలియుండి రంత.[1]

200


ఆ.

సీరచక్రపాణు లిరువురు విజయసం, పన్నులై చెలంగి పసుల మేపు
చుండి యొక్కనాఁడు భాండీరవటమున, కరిగి యచట నిష్టమైనగతుల.[2]

201


సీ.

కోలక్రోఁతులు బిల్లగోళ్లు దూరనఁగోల లందలంబులు మఱికుందికాళ్లు
పుట్లచెం డ్లుప్పనఁబట్టె లాలంకులు గుడుగుడుగుంచాలు గుంటచాళ్లు
చీఁకటిమొటికిళ్లు చిమ్ముబిల్లలు నెట్లు బొట్టనఁగోలలు బొమ్మరాలు
కుప్పిగంతులు పిడిగ్రుద్దులాటలు పిల్లదీవులు గొబ్బిళ్లు గూవనాలు


తే.

గుళ్లు దాఁగిలిమ్రుచ్చులు గోడిపట్టె, లేలపాటలు సరిబేసు లీలకూఁత
లాదిగా శైశవక్రీడ లాడి రచట, రామకృష్ణులు గోపదారకులఁ గూడి.[3]

202


వ.

ఇవ్విధంబున వినోదించుచున్న నొక్కనాఁడు ప్రలంబుండు గోపబాలవేషంబు
గైకొని వారలలోపల వర్తించుచుండి.

203


క.

ఇరువురు నిరువురు జోడై, బెరసి యొకరినొకరు మోచి పెద్దయుదూరం
బరుగుచు గెల్చుచు నోడుచు, నరుదగు క్రీడలఁ జెలంగి రందఱుఁ దమలోన్.[4]

204


ఆ.

హలి ప్రలంబు మోచె హరి సుదాముఁడు మోచె, నిట్టు లొక్కరొకరి నెక్కి వచ్చు
వారి మోచివచ్చువార లోడినవారి, భుజములందు నెక్కి పోవునపుడు.[5]

205


చ.

చెలఁగి సుదాము నెక్కి హరి సీరధరుండు ప్రలంబు నెక్కి వి
చ్చలవిడి నందఱుం దగినచందములన్ దమతోడియుద్దులన్
బలువిడి నెక్కి పోవునెడ బంధురవిక్రముఁ డైనదానవుం
డలుకమెయిన్ హలాయుధుని నప్పుడు మూఁపునఁ దాల్చె దండితోన్.[6]

206


క.

ఘనశకటచక్రనిభమగు, కనుఁగవయును దగ్ధశైలగాత్రము వికటా
ననమును లంబోదరమును, గనకాభరణములు బూని గగనమునందున్.[7]

207


తే.

పూర్ణచంద్రసమేతమై పొలుచు వర్ష, కాలమేఘంబుకైవడి కపటదనుజుఁ
డభ్రమార్గంబునందు హలాయుధప్రయుక్తుఁడై చనె లోక మోహో యనంగ.[8]

208
  1. పరిభవించువాఁడు = భంగపెట్టఁదలఁచినవాఁడు, రంధ్రాన్వేషణంబు = సందు వెదకుట, నిష్కంటకంబు = బాధ లేనిదిగా, దైత్యకంటకులు = రాక్షసులకు హింసకులు, ఇంపులన్ = మనసు వచ్చినట్లు, చూఱలు విడిచి = కొల్లపెట్టి, తగిలి = ఆసక్తులై.
  2. సీరచక్రపాణులు = బలరాముఁడును కృష్ణుఁడును.
  3. శైశవక్రీడలం = పసితనపుఆటలు, దారకులన్ = పిన్నవాండ్రను.
  4. బెరసి = కూడుకొని.
  5. హలి = బలరాముఁడు.
  6. ఉద్దులన్ = జతలను, బంధురవిక్రముఁడు = మంచిపరాక్రమము గలవాఁడు, దండితోన్ = సామర్థ్యముతో.
  7. దగ్ధశైలగాత్రము = కాలినకొండను బోలిన దేహము, వికటాననము = వికృతమైన ముఖము, లంబోదరము = వ్రేలుచున్న కడుపు.
  8. కాలమేఘంబు = నల్లనిమబ్బు, అభ్రమార్గంబునన్ = ఆకాశమునందు, ప్రయుక్తుఁడు = చక్కగా కూడుకొన్నవాఁడు.