పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దావనభూమినుండి యొకనాడు మహోగ్రనిశాటకోటికిం
దావలమై మహింబరఁగు తాళవనంబున కేగి యచ్చటన్.[1]

191


క.

పచ్చనికసవులు పసులను, విచ్చలవిడి మేయఁదోలి వేడుకతోఁ గ
న్నిచ్చకు వచ్చిన యచ్చటి, మెచ్చులతాళములలోన మెలఁగుచు నున్నన్.[2]

192


క.

కొందఱు గోపులు రామము, కుందులకడ కేగుదెంచి గోగణములతో
నిందు మనమున్న నొప్పుమి, చెందుఁ జుమీ యసురకోటిచే బశుతతికిన్.[3]

193


ఆ.

ధేనుకాదు లైనదానవు లీతాళ, వనములోన నున్న వారు దీని
సొచ్చి వాసవాదిసురగణంబులకైన, వెక్కసంబు బ్రతికి వెడలి చనుట.[4]

194


చ.

అని వినిపించిన బలమురాంతకు లుక్కునఁ జేరి యవ్వనం
బునఁ గల దైత్యకోటి బొరిపుచ్చక లోకముబాద మానదం
చు నరిగి చండకేసరికిశోరయుగంబును బోలె భీకర
ధ్వను లొనరించుచున్ జెలఁగి తాళవనాంతరభూమి సొచ్చినన్.[5]

195


ఉ.

ఆనినదంబు బిట్టు విని యప్పుడు గార్దభరూపధారులై
ధేనుకముఖ్యరాక్షసులు తీవ్రగతిం బఱతెంచి దేవకీ
సూనునిఁ దన్నుచున్ గఱచుచున్ సమరం బొనరింపఁ జొచ్చినన్
భానునిభప్రతాపబలభద్రుఁడు యాదవవీరుఁ డుగ్రుఁడై.[6]

196


క.

తనుఁ బొదివి బిట్టు కదిపిన, ఘనగార్దభదైత్యకోటికడ
కాళ్లం గై
కొని త్రిప్పి త్రాటిమాఁకుల, కొనలు దునిసి నేలమీఁదఁ గూలఁగ వైచెన్.[7]

197


క.

ధేనుకుఁడు చటులగార్ధభ, మై నిష్ఠురవృత్తితోడ నాహవమునకున్
బూని చనుదెంచుటయు హరి, వానిం గడకాలువట్టి వడిగా నింగిన్.[8]

198


చ.

బిరబిరఁ ద్రిప్పివైచుటయు బెట్టుగ నెత్తురు నోరఁ గ్రక్కుచున్
ధరణితలంబునం బడియెఁ దక్కినరక్కసులెల్ల భీతులై
యరిగి ప్రలంబుఁ జేరి శరణాగతులై యనిలోన ధేనుకా
సురవరుచావు చెప్పుటయు శోకసమాకులుఁడై ప్రలంబుఁడున్.

బలభద్రుండు ప్రలంబాసురుని సంహరించుట

వ.

మాయోపాయంబుల బలభద్రకృష్ణులఁ బరిభవించువాఁడై తదీయరంధ్రాన్వే

  1. మహోగ్రనిశాటకోటికిన్ = మిక్కిలి క్రూరులైన రాక్షసులసమూహమునకు, తాళవనంబునకున్ = తాటితోపునకు.
  2. కన్నిచ్చవచ్చిన = చూపునకు మనోజ్ఞమైన.
  3. గోపులు = గొల్లవాండ్రు, ఒప్పమి = చెఱుపు.
  4. వెక్కసము = కష్టతరము.
  5. ఉక్కునన్ = బలముతో, పారిపుచ్చక = చంపక, చండకేసరికిశోరయుగంబు = కోపించిన సింహపుపిల్లలజంట, చెలంగి = విజృంభించి.
  6. నినదంబు = ధ్వని, బిట్టు = అకష్టాత్తుగా, సమరంబు = యుద్ధము, భానునిభప్రతాపబలభద్రుఁడు = సూర్యునితో సమానమైన ప్రతాపముగలవాఁడైన బలరాముఁడు.
  7. తునిసి = తునిఁగి.
  8. నిష్ఠురవృత్తితోడన్ = పరుషప్రవర్తనముతో, నింగిన్ = ఆకాశమునందు.