పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జీమూతంబులు గర్జించినయాకారంబులఁ గ్రేళ్లు దాఁటియును తమతోడియాభీర
కుమారులు పాడినం దోడున శిరఃకంపంబులు చేసి మెచ్చుచు వినోదకృత్యంబు
లాడియును కలాపంబులు విచ్చి విలాసంబులుగా నాడుచున్న మత్తమయూరం
బుల వెనువెంటందగిలియును నిట్లు నానావిధంబు లయినబాల్యవినోదంబులం
బరమసంతోషచిత్తులై యుండి రంత.[1]

159

కాళీయమర్దనము

ఉ.

శ్రీవిభుఁ డొక్కనాఁడు విలసిల్లెడుచి త్తముతోడ లాంగలిన్
గోవుల గావ నంపి యొకకొందఱు బాలురతోఁడగూడి బృం
దావనమెల్లఁ జూచి యమునానదికిం జని తత్సమీపనీ
పావళినీడలం గడువిహారము సేయుచు నున్నయత్తఱిన్.[2]

160


ఉ.

ఆరయ నమ్మహాతటినియం దొకచోట హ్రదంబులోపలన్
దారుణ మైనహాలహలతాపవిషోల్బణ మైనగాలిచే
జేరువ నున్నవృక్షములజీవములం బరిమార్చుచుండు దు
ర్వారుఁడు కాళియాహి యనువాఁడు భయంకరవేషధారి యై.[3]

161


ఆ.

ఉగ్ర భుజగవిషసముజ్జ్వాల లెప్పుడు, నిగిడి వేఁడిసెగల పొగల మిగుల
నుడికి పొరలఁబడుచు నుండు నాయుదకంబు, లధికతప్తతైల మనఁగ మెఱసి.[4]

162


ఉ.

అట్టి హ్రదంబు తద్దయు రయంబున డగ్గఱి క్రూరకర్ముఁడై
యిట్టి భుజంగుఁ డిందు వసియించుటఁ జేసి కళిందకన్యము
చ్చుట్టును బాడువాఱి కడుశూన్యము నొందును వీని నెమ్మెయిన్
బట్టి వధింతు నంచుఁ జలపట్టి యదూద్వహుపట్టి దిట్ట యై.[5]

163


ఉ.

తటమునఁ బూచి యేచిన కదంబమహీరుహశాఖ యెక్కి యు
త్కటగతి కుప్పిగంతు గొని తద్భదమెల్ల గలంచుచుండి ను
ద్భటపటుగంధసింధురము పల్వలముం గలగుండు పెట్టి ప
ర్యటనము సేయునట్లు జలమంతయు భగ్గున మంట లుబ్బగన్.[6]

164
  1. జలధరకాలంబునన్ = వానకాలంబునందు, కదంబంబులు = సమూహములు గలవి, కదంబదామకంబులన్ = కడపపువ్వులదండలను, బర్హిపత్రంబులు = నెమలియీఁకలు, గాత్రంబులన్ = దేహములయందు, సాళగంబులతోడన్ = మేళనములతో, పిసాళించి = అతిశయించి, పైరిక = దున్నెడువారివలె, గైరికనికరంబులు = కావిరాలసముదాయములను, తోరంబుగాన్ = దట్టముగా, జీమూతంబులు = మేఘములు, క్రేళుదాఁటియును = కేకలు వేయుచు కుప్పెగంతులు వేసియు, ఆభీరకుమారులు = గొల్లపిల్లకాయలు, కలాపంబులు = పించెములు, మత్తమయూరంబుల = మత్తుగొన్న నెమిళ్లయొక్క.
  2. లాంగలిన్ = బలరాముని, నీపావళి = కడపచెట్లచాలుయొక్క.
  3. తటిని = యేఱు, హ్రదంబులోపలన్ = మడుఁగులో, హాలహల = హాలాహల మనెడు విషముయొక్క, ఉల్బణము = ఉప్పొంగినది.
  4. విషసముజ్జ్వాలలు = విషము యొక్క చక్కగా మీఁది కెగయునట్టి మంటలు, అధికతప్తతైలము = మిక్కిలి తెర్లిననూనె.
  5. కళిందకన్య = యమునానది, ముచ్చుట్టును =మూఁడుప్రక్కలను, యదూద్వహుపట్టి = శ్రీకృష్ణుఁడు.
  6. తటమునన్ = గట్టునందు, వీచిన = అతిశయించిన, కదంబ = కటపచెట్టుయొక్క, ఉత్కటగతిన్ … = ఉద్ధతితోడిరీతితో, గంధసింధురము = ఏనుఁగు, పల్వలమున్ = పడియను, కలగుండు పెట్టి = కలఁచి, పర్యటనము సేయు = తిరుగు.