పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సకలవిద్వత్కవీశ్వరమనోరథదానచింతామణినిభుండు చింతవిభుఁడు
చటులాహితివ్రాతసంహారదోస్సారగాంగేయసదృశుండు గంగశౌరి


ఆ.

దాశరథులకరణి ధరణీధరునిబాహు, దండములవిధమునఁ దమ్మిచూలి
మోము లనఁగ ధర్తమూర్తుల నలువురఁ, బెమ్మవిభుఁడు గాంచెఁ బెంపుతోడ.[1]

56


క.

ఆనలుగురికి సహోదరి, యై నెగడినయమ్మలాంబ యతులితభాగ్య
శ్రీ నుల్లసిల్లి తనసరి, మానవతులలోన నెల్లమహిమలు గాంచెన్.[2]

57


సీ.

ప్రకటసౌభాగ్యసంపదల నాదిమలక్ష్మి యఖిలశోభనముల నద్రికన్య
చతురభాషావిశేషముల సరస్వతి సౌకుమార్యంబున జనకతనయ
పరమపతివ్రతాగరిమ నరుంధతి ధైర్యంబుపెంపున ధరణికాంత
రూపలావణ్యనిరూఢి రతీదేవి సంతానమహిమచేఁ గుంతిదేవి


తే.

తోడఁ బ్రతివచ్చు గీర్తులు దొంగలింపఁ, బరఁగురావూరితమ్మయబసవవిభుని
కులవధూమణియై మహి నలరి మించె, నమితసౌభాగ్యనికురుంబ యమ్మలాంబ.[3]

58


క.

కులశీలంబులఁ బుట్టిన, యిలు చొచ్చిన యిల్లు వన్నె కెక్కఁగఁ జేసెన్
లలనలు రావురిబసవయ, కులసతి యగునమ్మలాంబకును సరి గలరే.[4]

59


క.

 ఆరమణీరమణు లతి, శ్రీరమ్యునిఁ జెదలువాఁడ శ్రీరఘునాథున్
గోరి భజించిరి యవ్విభు, కారుణ్యమువలన సుతులఁ గాంచిరి ముగురిన్.[5]

60


వ.

అం దగ్రజుండు.

61


సీ.

చూడనేర్చిననాఁడె చూడంగ నేర్చెను గవిగాయకులయిండ్లఁ గలిమి గలుగ
నవ్వనేర్చిననాఁడె నవ్వంగ నేర్చెను ధనలోభు లైనదుర్మనుజపతులఁ
బలుకనేర్చిననాఁడె బలుకంగ నేర్చెను సుజనసమ్మతముగా సూనృతంబు
నడవనేర్చిననాఁడె నడవంగ నేర్చెను మహనీయ మగుధర్మమార్గమునను


తే.

జదువనేర్చిననాఁడె తాఁ జదువనేర్చెఁ, ద్యాగసిద్ధాంతవేద్యంబు లైనకథలు

  1. నానాజనప్రమోదానూనపంచపర్వాన్నదానవినోది = సకలజనులకు సంతోషకరమయి మిక్కుటమైన పంచపర్వములయందలి అన్నదానముచేత వినోదించువాఁడు, (పంచపర్వములు: పున్నమ, అమావాస్య, కృష్ణాష్టమి, కృష్ణచతుర్దశి, సంక్రాంతి.) కంటకా... వల్లభుఁడు = క్షుద్రశత్రువులనెడు పర్వతములయొక్క రెక్కలను విఱుగఁగొట్టుటయందు దేవేంద్రుఁడు, సకల....చింతామణినిభుండు = ఎల్లవిద్వాంసులయొక్కయు కవీశ్వరులయొక్కయు కోరికలను యిచ్చుటయందు చింతామణిని పోలినవాఁడు (చింతామణి = కోరినదాని నియ్యఁజాలినరత్నము), చటుల...సదృశుండు = క్రూరులైన శత్రువులసమూహమును చంపఁజాలిన భుజపరాక్రమమునందు భీమునితో సమానుఁడు, ధరణీధరుఁడు = విష్ణువు, తమ్మిచూలి = బ్రహ్మ, ధర్మమూర్తులన్ = ధర్మస్వరూపులను.
  2. అతులితభాగ్యశ్రీమహిమలన్ = సరిపోల్పరాని మంచియదృష్టము కలిమివలని గొప్పతనములచేత.
  3. సౌభాగ్యము = సుభగత-సౌందర్యము, పెంపు = సమృద్ధి, ప్రతివచ్చు = సమానమగు, తొంగలింపన్ = అతిశయింపఁగా.
  4. వన్నె కెక్కన్ = ప్రసిద్ధి వహింప, కులసతి = ఇల్లాలు.
  5. రమణీరమణులు = ఆలుమగలు, అతిశ్రీరమ్యున్ = అధికైశ్వర్యముచేత మనోజ్ఞుడైన వానిని, భజించిరి = ఉపాసించిరి.