పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యాతనఁ బాతకజాతని, కేతనఁ బరిమార్చె గరుడకేతనుఁ డలుకన్.[1]

111


మ.

ఘనవజ్రాహతిఁ గూలు నీలగిరిశృంగప్రాయమై విహ్వల
ధ్వనితో నిట్లు వసుంధరంబడినఁ దద్ధ్వానంబు ఘోరంబుగా
విని గోగోపకగోపికానికరముల్ విభాంతిమై బిట్టు మే
ల్కని చూడన్ జనుదెంచి రర్భకుల కెల్లన్ వెక్కసిన్ రక్కసిన్.[2]

112


వ.

అంత యశోదానందు లప్పాపాత్మురాలియంకంబున నిశ్శంకితుండై యాడు
చున్న యర్భకు నెత్తుకొని భూతభయనివారణంబుగా గోపుచ్ఛంబు సురాళించి
గోమయంబునఁ దిలకంబు పెట్టి నారాయణస్తోత్రకవచంబులు పఠియించి
గృహోపకరణంబులు నిండిన బండిక్రింద నుయ్యాలతొట్టిలోనం బెట్టి.[3]

113


క.

రక్కసురాలికళేబర, మొక్కయెడకు నీడ్చి యిట్టియుత్పాతము నే
డిక్కడికి నెట్లు వాటిలె, నొక్కో యని గోపవృద్ధు లున్నట్టియెడన్.[4]

114


క.

ప్రకటముగ గపటబాలుఁడు, వికటముగాఁ బాదపద్మవిక్షేపములన్
నికటమున సకలపరికర, శకటంబై యున్న యట్టిశకటముఁ దన్నెన్.[5]

115


ఆ.

నిండుబండి నేడు నిష్కారణం బేలఁ, బొరలే నొక్కొ యనుచుఁ జొక్కి పడుచు
నున్న గోపసతులయొద్దకు నచ్చోట, నాడుచున్న పడుచు లరుగుదెంచి.[6]

116


ఆ.

ఈయశోదపట్టి యిప్పు డేమెల్లను, జూచుచుండ బండిఁ ద్రోచెఁ బొరల
ననుచుఁ జెప్పిపోయి రప్పు డచ్చటనున్న, వ్రేతలెల్లఁ జూచి వెఱఁగుపడిరి.[7]

117


ఆ.

ఆయశోద వచ్చి యాబండిలో నిండి, యుండినట్టి కుంభభాండతతుల
పాలు నెయ్యి నేలపాలైనఁ జిడిముడి, పడుచుఁ బడుచుమీఁద నడిచిపడుచు.[8]

118


వ.

వచ్చి యచ్చిన్నిపాపనిపాదవిక్షేపంబువలన విధ్వస్తంబు అయినసమస్తవస్తువులను
బొందుపఱిచి దధిగంధపుష్పాక్షతంబులచేత శకటంబుఁ బూజించిన.[9]

119


ఉ.

గోపిక లెల్ల నచ్చటికి. గూడి యశోద వినంగ నమ్మ నీ

  1. కంసవచోమృతవేతన = కంసుని ప్రియవాక్యములనెడు సంబళము గలది, విహ్వల = స్వాధీనముగాని, చేతోయాతన = మనోవేదన గలది, పాతకజాతనికేతన = పాపసమూహములకు నిల్లైనది.
  2. ఘనవజ్రాహతి = గొప్పవజ్రాయుధముయొక్క దెబ్బచేత, శృంగప్రాయము = శిఖరము వంటిటి, ధ్వానంబు = ధ్వని, ఘోరంబుగాన్ = భయంకరముగా, విభ్రాంతిమైన్ = దిగ్భ్రమముతో, బిట్టు = తటాలున, అర్భకుల కెల్లన్ = పసిబిడ్డల కెల్లను, వెక్కసిన్ = హింస కలుగఁజేయుదానిని.
  3. అంకంబునన్ = ఒడిలో, నిశ్శంకితుండు = భయపడనివాఁడు, సురాళించి = దిగదుడిచి.
  4. కళేబరము = దేహము, వాటిలెన్ = కలిగెను.
  5. ప్రకటముగన్ = ప్రసిద్ధముగా, వికటముగాన్ = పొరలి యెగుడుదిగుడుగా పడఁగా, విక్షేపములన్ =ఎగఁజాచుటల చేత, నికటమునన్ = సమీపమున, సకలపరికరశకటము = ఎల్లవస్తువులను వహించినది.
  6. పడుచులు = బాలకులు.
  7. వ్రేతలు = గోపికలు, వెఱఁగుపడిరి = ఆశ్చర్యబడిరి.
  8. కుంభభాండతతులు = కడవలయందును బానలయందును నుండిన, చిడిముడిపడుచు = ముఖవికారమును కలుగఁజేసికొనుచు, అడిచిపడుచున్ = కోపగించుకొనుచు.
  9. విధ్వస్తంబులు = మిక్కిలి చెదరివడిపోయినది, పొందుపఱిచి = అనువుగా నుంచి.