పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని పలికి మఱియు నిట్లనియె.

101


తే.

నందగోపక రోహిణీనందనుండు, పెరుగుచున్నాఁడు మీయొద్ద గరిమతోడ
నీకుమారునిఁ బెంచిన ట్లాకుమారు, నరసి రక్షింపు మీమది బెరుకు లేక.[1]

102


క.

అని యిట్లుపలికి మంతన, మున కాతనిఁ బిలిచి మీకు మొల్లమిగలవా
రని కంసుఁ డెఱిఁగియుండును, జన దిచ్చట నుండ నొండుచాయకుఁ జనుఁడీ.[2]

103


క.

నెట్టన వర్షావధికిం, బెట్టంగలయప్పనములు పెట్టియు మధురా,
పట్టణసమీపమున మీ, రొట్టినసంపదలతోడ నుండఁగ నేలా.[3]

104


తే.

పావకుండును గపటంపుభూవరుండుఁ, దమ్ముఁ గడుఁజేరి మందెమేలమ్ముతోడ
నున్నవారికిఁ గీడు సేయుదురు వారి, కంచితన్నేహమున మంట లధికమగును.[4]

105


మ.

అని గర్భీకృతవాక్యపద్ధతుల నధ్యాహారముల్ సేయ హా
యిని నందాదులు గోసమూహములతో నేపారి దూరంబుగాఁ
జని రమ్యాటవులందు నుండిరి యథేచ్ఛావృత్తితోడన్ దృణం
బును నీరున్ గలతావులన్ బసులగుంపుల్ మేసి సొంపారఁగన్.[5]

106

పూతనావధశకటాసురవిధ్వంసనాదివివరణము

వ.

అంత నానందగోకులంబున నత్యంతసుందరాకారంబున నందనందనుండు పెరుగు
చుండుట విని పూతన మనోహరం బైనయాకారంబు దాల్చి యర్ధరాత్రసమ
యంబున యశోదానివాసంబు సొచ్చి.

107


తే.

నిద్రవోవంగ మెల్లన నిమిరి యెత్తి, మేలుకొనఁజేసి చెక్కులు మీటిమీటి
విష మమర్చినచన్ను తావిషధిశయను, నోరిలోపల నిడి చేత నొక్కుటయును.[6]

108


తే.

చన్నుఁబాలతోఁగూడ నాజంతయొడలి, ప్రాణవాయువు లన్నియు బలిమిఁ గ్రోలె
నప్పు డుద్విగ్నచిత్తయై యసురవనిత, బిట్టు రవమున హో యని పృథివిఁ గూలె.[7]

109


వ.

ఇవ్విధంబున.

110


క.

పూతనఁ గంసవచోమృత, వేతనఁ బ్రాణప్రయాణవిహ్వలచేతో

  1. బెరుకు = భేదము.
  2. మంతనమునకున్ = రహస్యస్థలమునకు, మొల్లమి = ధనసంపద.
  3. నెట్టనన్ = తప్పక, వర్షావధిన్ = సంవత్సరాంతమునకు, పెట్టంగలయప్పనములు పెట్టియున్ = ఇయ్యవలసినపన్నులు ఇచ్చియు, ఒట్టిన = అధికమైన.
  4. మందెమేలమ్ముతోడన్ = సరసత్వముతో, స్నేహమునన్ = మిత్రత్వముచేత - నూనెచేత, మంటలు = మనస్తాపములు - మండుటలు.
  5. గర్భీకృతవాక్యపద్ధతులన్ = లోపల విశేషార్థము కలిగియుండు మాటలరీతులను, అధ్యాహారములు = ఊహలు, హాయిని = నిశ్చింతతో.
  6. నిమిరి= తడవి, మీటి = వ్రేళ్లతో తాటించి, విషధిశయమునిన్ = ప్రళయసముద్రమునందు పండుకొనువాఁడైన శ్రీకృష్ణునియొక్క, నొక్కుటయున్ = ఒత్తిపట్టఁగా.
  7. జంత = ధూర్తురాలియొక్క, క్రోలెన్ = త్రాగెను, బిట్టు = అధికమైన.