శ్రీవిష్ణుపురాణము
సప్తమాశ్వాసము
|
రావూరిపురాధిప
వారాశిగభీర వంశవర్ధన బసవ
క్ష్మారమణపుత్ర సంప
త్ప్రా రంభకళాదిలీప రాఘవభూపా.[1]
| 1
|
వ. |
సకలపురాణవిద్యాధురంధరుం డైన పరాశరుం డామైత్రేయున కిట్లనియె నట్లు రాజ
వంశంబులపరిపాటి నేర్పరించి చెప్పితి నింక నెయ్యిది విన నిష్టం బనిన నతం డిట్లనియె.[2]
| 2
|
క. |
యాదవవంశంబున దా, మోదరుఁ డగుకృష్ణుఁ డతిసముజ్జ్వలమహిమన్
ప్రాదుర్భవించి బాల్యం, బాదిగ నేమేమి సేసె నది వినవలయున్.[3]
| 3
|
వ. |
అని శ్రీకృష్ణకథాశ్రవణకుతూహలుండయి యడిగిన మైత్రేయునకుఁ బరాశరుం
డిట్లనియె.
| 4
|
క. |
దేవసమానుండగువసు, దేవుఁడు దేవకునికూఁతు దేవకి నవనీ
దేవినిభఁ బెండ్లియాడి మ, హావిభవము దొంగలింప నాలుం దానున్.[4]
| 5
|
శ్రీకృష్ణావతారకథాప్రస్తావము
ఆ. |
అరద మెక్కి సూతుఁడై కంసుఁ డేతేరఁ, దగినవారుఁ దానుఁ దనపురమున
కరుగుదేర నడుమ నందఱు వెఱఁగంద, గగనవాణి పలికెఁ గంసుతోడ.[5]
| 6
|
క. |
ఇమ్మగువయెనిమిదవగ, ర్భమున నుదయించునట్టిబాలుఁడు నీ ప్రా
ణమ్ములు రాజ్యము గొనియెడు, సుమ్మీ యనిపలికె మనసు చుఱ్ఱుమనంగన్.
| 7
|
ఉ. |
అవ్వచనంబు చిత్తమున నారటపా టొదవింప నెంతయున్
నివ్వెఱఁ గంది యొం డుపమ నేరక యారకయుండి యింతలో
|
|
- ↑ వారాశిగభీర = సముద్రమును బోలిన గాంభీర్యగుణముగలవాఁడా, సంపత్ప్రారంభకళాదిలీప = సంపదను వృద్ధిచేయునట్టి ప్రయత్నముచేత దిలీపుఁడా.
- ↑ పరిపాటిన్ = క్రమముగా.
- ↑ ప్రాదుర్భవించి = పుట్టి.
- ↑ అవనీదేవినిభన్ = భూదేవివంటిదానిని, తొంగలించన్ = అతిశయింప.
- ↑ పురమునకు = ఇంటికి, వెఱఁగందన్ = ఆశ్చర్యము నొందఁగా.