పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శాంతి.

బాహువిక్రమప్రతాపబాహులేయసంగరో
త్సాహ సాహసాభినేయసావాసాంక సర్వస
న్నాహవాహినీసమేత నవ్యకీర్తిచంద్రికా
రోహిణీహృదీశ దాసరోహణావనీధరా.[1]

412


గద్య. ఇది శ్రీమదమరనామాత్యపుత్ర హరితగోత్రపవిత్ర సుకవిజనవిధేయ వెన్నెల
గంటి సూరయనామధేయప్రణీతం బైన ఆదిమహావురాణంబగు బ్రహ్మాండంబు
నందలి పరాశరసంహిత యైనశ్రీవిష్ణుపురాణంబునందుఁ జంద్రుండు బృహస్పతి
పత్ని నపహరించుటయు పురూరవుకథయును రుచికుండు సత్యవతి వరించుటయు
విశ్వామిత్రజమదగ్నులజన్మంబును రజిపుత్రు లింద్రునిరాజ్యం బపహరించుటయు
యదువంశకీర్తనంబును జ్యామఘుచరితంబును శమంతకరత్నోపాఖ్యానంబును
వసుదేవాదియాదవులజన్మంబును పౌరవవంశకీర్తనంబును పాండవ
క్రమంబును కలియుగధర్మంబు నన్నది షష్ఠాశ్వాసము.


————

  1. బాహులేయసంగరోత్సాహ = కుమారస్వామిదయిన యుద్ధోత్సాహమువంటి యుద్ధోత్సాహము గలవాఁడా, సాహసాభినేయసాహసాంక = సాహనముచేత అభినయింపఁదగిన విక్రమార్కుఁడుగలవాఁడా - సాహసాంకుఁ డనుబిరుదు వహించి విక్రమార్కునికంటె సాహసముగలవాఁడా యనుట, నవ్యకీర్తిచంద్రికారోహిణీహృదీశ = అపూర్వమైనకీర్తి యనెడు వెన్నెల చేత చంద్రుఁడైనవాఁడా, దానరోహణావనీధరా = దానమునందు రత్నపర్వతమైనవాఁడా.