పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నునకు నులూచియందు నిలావంతుండును చిత్రాంగదయందు బభ్రువాహనుండు
ను సుభద్రయందు నతిబలపరాక్రముం డైనయభిమన్యుండును అభిమన్యునకు
విరాటపుత్రి యైనయుత్తరయందు పరీక్షిత్తుండును బుట్టిరి. ఆపరీక్షిత్తుండు వర్త
మానకాలంబున రాజ్యంబు చేయుచున్నవాఁడు. అట్టి పరిక్షిత్తునకు మహాధర్మ
శీలుం డైనజనమేజయుండు పుట్టి వేదవ్యాసశిష్యుం డైనవైశంపాయనువలన
శ్రీమహాభారతంబు విని యనేకయజ్ఞంబులు సేసి సాంప్రతంబున రాజ్యంబు సేయ
నున్నవాడుఁ మఱియును.[1]

391


ఆ.

భూతవర్ధమానభూపాలకులనెల్ల, వింటి తేటపడ భవిష్యదవనీ
పతులలోన ఘనులఁ బ్రకటించి చెప్పెద, వినుము సావధాన విమలబుద్ధి.

392


క.

జనమేజయుండు త్రిజగ, జ్ఞానవినుతుం డైనయాశతానీకుని బు
త్రునిఁ గాంచు నమ్మహీపతి, జనకునిచందమున ధర్మసంతతి నమరున్.

393


ఆ.

యాజ్ఞవల్కివలన నధ్యయనముఁ గృపా, చార్యువలన నస్త్రశస్త్రములును
శౌనకమునివలన సచ్చిదానందవి, ద్యలు నెఱంగు లోకములు నుతింప.

394

కలియుగదోషాదివివరణము

వ.

అట్టి సూర్యసోమవంశంబుల రాజపరంపరలు కలియుగంబునఁ గొంతకాలంబు
నకు హీనబలులై యల్పవైభవంబుల రాజ్యంబులు సేయుచుండి తమతమయధ
ర్మవర్తనంబుల వినాశంబై పోవంగలవారు. వారిప్రధానులు స్వామిద్రోహం
బులు సేసి రాజ్యంబులు గైకొని యేలంగలవారు. మూర్థాభిషిక్తు లైనరాజన్యుల
వెడలనడిచి గంగాప్రయాగమధ్యదేశంబులు పద్మవర్యులనుమాగధు లేలం
గలవారు నర్మదాతీరదేశంబుల వ్రాత్యు లైనబ్రాహ్మణులు చేకొనంగలవారు.
చంద్రభాగాతీరంబు లైనకాశ్మీరదేశంబు లాభీరు లేలంగలవారు. వీరలెల్ల తుల్య
కాలవ్యవహారవయోధర్మపరాయణులై యుండెదరు.

395


క.

అల్పప్రసాదములుఁ గడు, నల్పవివేకములు నాయు వల్పము ముఱి య
ల్పాల్పపరిజ్ఞానంబులు, నల్పము లగువైభములు నగు రాజులకున్.[2]

396


ఉ.

కోపము దుర్వివేకమును క్రూరతయున్ జపలత్వమున్ మన
స్తాపము దుష్టవృత్తియును ధౌర్యము చౌర్యము హీనభావమున్
బాపము గల్గు మర్యులకుఁ బాడియుఁ బౌరుషమున్ బ్రతాపమున్
దాపసముఖ్య లేదు వసుధన్ గలికాలము పోవునంతకున్.[3]

397


వ.

మెలఁకువ లధమాధమములు, పలుకు లసత్యములు లేవు పౌరుషములు నే
ర్పులు రిత్తబ్రతుకులు తఱచు, గలవని చెప్పంగరాదు కలియుగవేళన్.[4]

398
  1. దేవరన్యాయంబునన్ = (దేవరేణసుతోత్పత్తి) అనెడు న్యాయముచేత - మఱఁదివరుసచేత,
    సాంప్రతంబునన్ = ఆకాలమందు.
  2. వివేకము = యక్తాయుక్తపరిజ్ఞానము, పరిజ్ఞానము = ఎల్లవిషయములందును సామాన్యమైన తెలివి.
  3. ధౌర్త్యము = ధూర్తత్వము, చౌర్యము = దొంగతనము, హీనభావము = హీనత్వము, పాడి = న్యాయము.
  4. మెలఁకువలు = జాగరూకతలు, రిత్త = వట్టిది - శూన్యము, బ్రతుకులు = బ్రతుకుఁదెరువులు, తఱచు = బహువిధము.