పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బొందిరి, అనువంశసంభవు లయ్యంగవంగకళింగాదిరాజపరంపరలై విస్తరిల్లిరి.

387


క.

ధీరుఁడు యయాతి ధరణీ, భారధురంధరునిఁ గాఁగఁ బట్టము గట్టెన్
సౌరభ్యఘనయశఃక, ర్పూరున్ గారుణ్యహృదయపూరున్ బూరున్.

388

పౌరవవంశానుక్రమము

వ.

అట్టిపూరునకు జనమేజయుండును జనమేజయునకుఁ బ్రచిన్వంతుండు నాతనికి
ప్రవీరుండును ప్రవీరునకు సుమనసుండును అతనికి సుద్యుమ్నుండును వానికి
బహుగుండును నతనికి సంయాతియు వానికి సహంయాతియు వానికి రౌద్రా
శ్వుండును రౌద్రాశ్వునకు ఋతేపుప్రభృతులు పదుండ్రును బుట్టిరి. అందు ఋతే
పునకు రంతినారుండును వానికి సుమతియు నప్రతిరథుండును ధ్రువుండును అంతి
నారుండు నననలువురు పుట్టిరి. అప్రతిరథునకుఁ గణ్వుండును కణ్వునకు మేధాతిథి
యునుం బుట్టిరి. వానివంశపరంపరలు కాణ్వాయనులను బ్రాహ్మణులైరి. మఱియు
నప్రతిరథునకు నైలీనుండు పుట్టె, వానికి దుష్యంతుండును నతనికి భరతుండును
నతకి బృహత్క్షత్రుండును నతనికి సేనజిత్తుండును నతనికి బ్రహ్మదత్తుండును నతనికి
జయత్సేనుండును నాతనికిఁ గురుండును నతనికి దిలీపుండును దిలీపునకుఁ బ్రతీపుం
డును ప్రతీపునకు దేవాపిశంతనుబాహ్లికులును శంతనునకుఁ జిత్రాంగదవిచిత్ర
వీర్యులునుం బుట్టి రందుఁ జిత్రాంగదుండు బాల్యంబునఁ జిత్రాంగదుం డనుగంధ
ర్వునితోడ యుద్ధంబు చేసి హతుండయ్యె విచిత్రవీర్యుండు.

389


ఆ.

కాశిరాజకన్యకల నంబికాంబాలి, కల వివాహమై వికాసవీలఁ
దదుపభోగరతులఁ దగిలి క్షయవ్యాధిఁ, బొంది యతఁడు దినిజపురికి నరిగె.

390


వ.

అంత సత్యవతీనియుక్తుండై కృష్ణద్వైపాయనుండు దేవరన్యాయంబున నంబిక
యందు ధృతరాష్ట్రుని నంబాలికయందుఁ బాండురాజును విచిత్రవీర్యునిభోగస్త్రీ
యందు విదురుం బుట్టించె నందు ధృతరాష్ట్రునికి గాంధారియందు దుర్యోధన
దుశ్శాసనప్రముఖులు నూర్వురు పుట్టిరి. పాండురాజునకుఁ గుంతీమాద్రుల
యందు ధర్మానిలశక్రాశ్వినులవరంబున యుధిష్ఠిరభీమార్జుననకులసహదేవు
లనంగా నేవురు పుట్టిరి. వారలందఱకుఁ బాంచాలి ధర్మపత్ని యయ్యె. దానియం
దు ధర్మరాజునకుఁ బ్రతివింద్యుండును భీమసేనునకు శ్రుతసోముండును
నర్జునునకు శ్రుతకీర్తియు నకులునకు శతానీకుండును సహదేవునకు శ్రుతధర్ముండు
నను నుపపాండవులు పుట్టిరి. మఱియు ధర్మరాజునకు నౌధేయియందు దేవకుం
డును భీమసేనునకు హిడింబయందు ఘటోత్కచుండును నకులునకు రేణుమతి
యందు నిరమిత్రుండును సహదేవునకు విజయయందు సుహోత్రుండును అర్జు