పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని పలికి వెండియు తరువాతికథావిధానం బెఱింగించువాడై యిట్లనియె.

378


తే.

రమణరోహిణీదేవకీప్రముఖసతుల, బ్రీతితో వసుదేవుండు పెండ్లియాడ
నందు రోహిణీదేవికి నాదిరుద్ర, మూర్తి సంకర్షణుండు రాముఁడు జనించె.[1]

379


వ.

ఆబలభద్రవంశపరంపర లనేకంబు లయ్యె.

380


తే.

దేవకీదేవి కావసుదేవునకుఁవగు, మారషట్కంబు జనియించి వారలెల్లఁ
గంసుచేఁ జచ్చి రేడవగర్భమునను, యోగనిద్రను సిద్ధి నచ్యుతుఁడు నసుప.

381


వ.

వచ్చి దేవకీదేవిగర్భంబున నున్నయర్భకుం గొనిపోయి రోహిణీజఠరంబున నునిచె
నిట్లు సంకర్షణభావంబు నొందుటం జేసి బలభద్రుండు సంకర్షణుండయ్యె. అంత
నెనిమిదవగర్భంబున సకలజగన్మహాతరుమూలభూతుండును, అతీతానాగతవర్త
మానకాలసమేతుండును, సమస్తసురాసురమునిజనజ్ఞానగోచరుండును, మహీ
భారావతరణమనుష్యకర్మసమాచరణుండును, నిరంతరకృపావర్ధిష్ణుండును, నైన
కృష్ణుండు పుట్టె.[2]

382


ఆ.

యోగనిద్ర హరినియోగంబునను నందు, కాంత యగుయశోదగర్భమునను
జనన మొందెఁ గాళి యనుమహాశక్తియై, పుడమిజనులచేతఁ బూజనొనుచు.[3]

383


వ.

కృష్ణుండు పదాఱువేలు న్నూటయెనమండ్రుభార్యల వివాహంబై వారియందు
లక్షయం నెనుబదివేవురుకుమారులం బడసి, వారిపుత్రపౌత్రవర్గంబు లసంఖ్యం
బులయ్యె. ఇట్లు యాదవవంశవిస్తారంబు వేఱువేఱు నుపన్యసింప నూఱుసంవత్స
రంబులు చెల్లు.

384


క.

పదివేలును పదివేలును, మొదలన్ గుణియించి నియుతమున నది నిహతం
బొదవింపఁగ నగు సంఖ్యలు, యదువీరప్రముఖు లైనయవనీనాథుల్.

385


ఉ.

సంగరభూమియందు మును చచ్చినదానవదైత్యదేవతా
పుంగవు లందఱు ధరణిఁ బుట్టిరి యాదవవంశ్యులై ధరి
త్రిo గడుసాధుబాధ లొనరించుచు నుండిరి తత్కులంబులో
నం గులదీపకుండు యదునాథుఁడు కృష్ణుఁడు మించెఁ బుణ్యుఁడై.[4]

386


వ.

మఱియు యయాతి రెండవపుత్రుం డైనదుర్వసువంశంబు తండ్రిశాపంబునఁ
బౌరవకులంబునం గలసె. ద్రుహ్యువంశంబురాజులు మ్లేచ్ఛకిరాతధర్మంబులం

  1. రమణన్ = ఒప్పిదముగా, సంకర్షణుండు = ఎల్లలోకములను లయకాలమునందు చక్కఁగ నాకర్షించువాఁడు.
  2. సంకర్షణభావము = లెస్సగా ఆకర్షించునట్టి భావమును, సకలజగన్మహాతరుమూలభూతుఁడు = ఎల్లలోకము లనెడు గొప్పవృక్షమునకు వేరైనవాఁడు - లోకములకెల్ల ముఖ్యకారణమైనవాఁ డనుట, అతీతానాగతవర్తమానకాలసమేతుండు = కడచినదియు రాఁగలదియు జరుగునదియు నైనకాలములతోఁ గూడుకొన్నవాఁడు - కాలత్రయమునందు నుండువాఁడనుట, మనుష్యకర్మసమాచరణుండు = మనుష్యులు చేయుపనులను నడపువాఁడు.
  3. నియోగంబునన్ = ఆజ్ఞచేత.
  4. సంగరభూమి = యుద్ధభూమి.