పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

గురుభుజస్తంభాసికుంభీనసస్వామి కరినృపప్రాణానిలాన్న మొసఁగి
లలితసత్కిరివల్లరుల కుల్లసితోరుసుగుణాలవాలంబు నిగుడఁ జేసి
భవ్యప్రతాపదీపజ్వాలికకును దామరసగర్భాండమందిర మొనర్చి
సుకవిగాయకచకోరకనికాయములకు నిజకృపాపాంగచంద్రికల నొసఁగి


తే.

గగనజగతీహరిత్కుడుంగప్రకీర్ణ, దానధారాభిరామచేతఃప్రవర్తి
యతఁడు పంటకులాంబుధి కబ్జవైరి, సన్నుతోదారి తమ్మయయన్నశౌరి.[1]

43


చ.

అరుదుగఁ దమ్మభూవిభునియన్ననిదాడికి నోడి శాత్రవుల్
దిరుగనిడొంకలుం బడనితెక్కలిటెంకులు పాదచారులై
యరుగనికానలుం జొరనియీఱమికోనలు భీతచిత్తులై
సురుఁగనిత్రోవలున్ నిలువఁజూడనిక్రేవను లేవు భూస్థలిన్.[2]

44


ఆ.

అట్టితమ్మరెడ్డి యన్నభూపాలుని, యనుగుఁదమ్ముఁ డైనవినుతయశుఁడు
లింగభూమిభర్త సంగీతసాహిత్య, సరసవిద్యలందుఁ జతురుఁ డయ్యె.

45


సీ.

కుంభినీభృత్కుంభికుంభీనసేంద్రుల కూఱట యెవ్వనియురుభుజంబు
పాథోధిరాధేయపారిజాతములకు వీడుదో డెవ్వనివితరణంబు
కందర్పచంద్రసంక్రందనసుతులకుఁ దలవంప దెవ్వనిలలితమూర్తి
రాధేయబాహులేయాదితేయజులకు వెక్కసం బెవ్వనివిక్రమంబు


తే.

కంజబాంధవశంపాధనంజయులకు, వెఱపుఁ బుట్టించు నెవ్వనివిపులతేజ
మతఁడు సంతతదానవిద్యావినోది, లేఖనిభుఁ డైనతమ్మయలింగవిభుఁడు.[3]

46


సీ.

పరమయోగజ్ఞానపారీణతలయందు ఖాండిక్యజనకులకంటె మేలు
సంతతత్యాగసిద్ధాంతవిద్యలయందుఁ గమలాప్తసూనునికంటె మేలు
సమ్మోహనాకారసౌందర్యములయందుఁ గమపూవిలుకానికంటె మేలు

  1. గురు ... స్వామికి = గొప్పభుజమనెడు స్తంభమునందలి కత్తియనెడు సర్పరాజునకు, వల్లరులకున్ = లజ్జతీఁగలకు, ఆలవాలము = పాది, జ్వాలికకున్ = జ్వాలకు, తామరసగర్భాండమందిరము = బ్రహ్మాండమనెడి యిల్లు, అపాంగచంద్రికల్ = కడగంటిచూపులనెడు వెన్నెలలను, గగన...ప్రవర్తి = ఆకాశమునందును లోకమునందలి యెల్లదిక్కులనెడు పొదరిండ్లయందును చల్లఁబడినదానోదకధారలచేత మనోజ్ఞముగా చేయఁబడిన మనోవ్యాపారము గలవాఁడు, అబ్జవైరి = చంద్రుఁడు.
  2. దాడికిన్ = ధాటికి – యుద్ధయాత్రకు, తెక్కలిటెంకులు = దొంగచోట్లు - రహస్యప్రదేశము లనుట, కానలు = అడవులు, ఈఱమికోనలు = చెట్లచే తఱుచైనకొండలు, సురుఁగని = దాఁగని, క్రేవలం = పార్శ్వములు.
  3. శంఖినీ... కుంభీనసేంద్రులకున్ = భూమిని భరించునట్టి దిగ్జములకును ఆదిశేషునకును, ఊఱట = అలఁపు దీర్చుకొనఁదగిన సహాయము, పాథోధి = సముద్రము, వీడుదోడు = అంపుతోడు, కందర్పచంద్రసంక్రందనసుతులకు = మన్మథచంద్రజయంతులకు, తలవంపు = అవమానకరము, బాహులేయుఁడు = కుమారస్వామి, ఆదితేయజుఁడు = అర్జునుఁడు, కంజబాంధవశంసాధనంజయలకున్ = సూర్యునకు మెఱపునకు అగ్నికిని, లేఖనిభుఁడు = దేవసముఁడు.