పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే.

సమదవిద్వేషి రాజన్యసైన్యజలధి, ఘోరసంరావశోషణకుంభజుండు
భీమబలశాలి నిస్సీమభూమిదాన, పరశురాముఁడు తమ్మయబసవవిభుఁడు.[1]

38


సీ.

నిరుపమగుణశీలనిజబంధులోచనోత్పలకలాపమున కుత్సవ మొనర్చి
నిఖిలభూజనచిత్తనిస్తంద్రనవచంద్రకాంతరత్నంబులఁ గరఁగఁజేసి
సంభృతైశ్వర్యప్రశస్తవంశామృతాంభోనిధానంబు నుప్పొంగఁజేసి
సన్నుతసత్కవీశ్వరగాయకచకోరసమితి కానందంబు సంతరించి


తే.

వైరిరాజన్యకామినీవదనపంక, జములు ముకుళింపఁజేయుచు జగములందు
నెసఁగు రావూరితమ్మయబసవవిభుని, కీర్తిచంద్రుఁడు సత్కళాకీర్ణుఁ డగుచు.[2]

39


సీ.

కపటారివాహినీకాంతారములఁ గాని దరికొల్పఁ డతులతాపవహ్ని
బంధుమిత్రనిశాంతపంకజంబులఁ గాని భాసిల్లనీఁడు సౌభాగ్యలక్ష్మి
బ్రహ్మాండమండలోపఘ్నసీమలఁ గాని వర్తింపనీఁడు సత్కీర్తిలతల
రాజరాజాస్థానరంగస్థలులఁ గాని యాడనీఁ డురుచరిత్రాప్తి నటుల


తే.

సకలసుకవీంద్రబంధునిర్జరులఁ గాని, యాననీఁడు వచోమధురామృతంబు
నవ్యసంగ్రామకేళీధనంజయుండు, పల్లవార్కుండు రావూరిబసవవిభుఁడు.[3]

40


సీ.

కటకాధిపతియైన గజపతిరాజుచేఁ బ్రతిలేనిపల్లకిపదవి నొందె
మహిమచేఁ గర్ణాటమండలాధిపుచేతఁ గడలేనిరాజ్యభాగములు గాచెఁ
ప్రౌఢపౌరుషమున రాజిల్లి మెఱయఁ గామలకవజీర్ల కమ్మలికఁజేసెఁ
దెలగాణభూములఁ గలమన్నెవారిచే బలవంతమునను గప్పములు గొనియెఁ


తే.

జాటుధాటీనిరాఘాటఘోటకావ, ళీఖురోద్ధూతనిబిడధూళీవిలిప్త
మండితాశాంగనాకుచమండలుండు, బాహుబలశాలి తమ్మయబసవవిభుఁడు.[4]

41


క.

ఆతనిసహోదరుఁడు జల, జాతప్రియతేజుఁ డహితశాసనకేళీ
కౌతూహలుఁ డన్నయధా, త్రీతలనాథుండు వెలసెఁ దేజోధికుఁడై.[5]

42
  1. కుటిల.....ధరుఁడు = మిక్కిలిక్రూరులగు శత్రురాజులనెడు గొప్పకొండలగుమికి ఇంద్రుఁడైనవాఁడు, దారుణా... ప్రభంజనుండు = భయంకరులగు శత్రువులనెడు మేఘములను ఎగురఁగొట్టుటయందు భయంకరమై యతిశయించిన వానగాలి, పటు... వైశ్వానరుండు = మిక్కిలి సామర్థ్యముగల శత్రువులపక్షము నవలంబించినవారనెడు భయంకరమయిన అడవికి మిక్కిలి విజృంభించిన వేండ్రముగల అగ్నిహోత్రుఁడు, కఠినా.. ప్రభాకరుండు = కఠినులైన శత్రువులసమూహమనెడు దట్టమైనచీఁకటిని హరించెడు మిక్కిలి వేడిమిగల యెండను కలుగఁజేయునట్టి సూర్యుఁడు, సమద...కుంభజుండు = మదించిన శత్రురాజులసేన యనెడు సముద్రముయొక్క భయంకరమైనధ్వనిని ఆణఁచుటయందు అగస్త్యుఁడైనవాఁడు, భీమబలశాలి = భీమునితో సమానమయిన బలముగలవాఁడు, నిస్సీమభూమిదానపరశురాముఁడు = ఎల్లలేనిభూమిని దానము చేయుటయందు పరశురాముఁడయినవాఁడు.
  2. ఉత్పలకలాపమునకు = నల్లగలువలసమూహమునకు, నిస్తంద్ర = చలింపని, అమృతాంభోనిధానము = పాలసముద్రము. సంతరించి = బాగుపఱచి - కలిగించి యనుట, కళాకీర్ణుఁడు = కళలను వెదచల్లినవాఁడు.
  3. వాహిని = సేన, దరికొల్పఁడు = కాల్పఁడు, నిశాంతము = ఇల్లు, ఉపఘ్నము= ప్రాకుడు, రంగస్థలి = నాట్య మాడెడుచోటు.
  4. రాజిల్లి = ఒప్పి, మలకనజీర్లకున్ = తురకయోధులకు, ఉమ్మలిక = పరితాపము, చాటు...మండలుండు = స్తుతిచేయఁదగిన యుద్ధయాత్రయందు తడఁబాటు లేని గుఱ్ఱపుబారులయొక్క గొరిసెలచేత ఎగురజిమ్ముఁబడిన దట్టమయినదుమ్ముచే పూయఁబడుటచేత అలంకృతములైన దిక్కులనెడు స్త్రీలయొక్క గుండ్రనైన స్తనప్రదేశములు గలవాఁడు.
  5. జలజాతప్రియతేజుఁడు = సూర్యునితేజస్సువంటి తేజస్సు కలవాఁడు, అహితశాసనకేళీకౌతూహలుఁడు = పగవారిని శిక్షించుట యనెడు క్రీడయందు కుతూహలము కలవాఁడు.