పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


బౌరుషము యశము గలత, న్మూరెడ్డి సమస్తజనులు ప్రస్తుతి సేయన్.[1]

33


సీ.

తనగుణశ్రేణి దిగ్ధరణీశకోటీరసముదయంబులకు రత్నములు చేసెఁ
దనసాహసము సముద్యదర్పవిద్వేషిజగతీశులకు గుండెదిగులు చేసెఁ
దనకీర్తి తారకాధవతారకాతారవసుధాధరములకు వన్నె చేసెఁ
దనదానమహిమ మందారగుహ్యకరాజశిబిదధీచులకును సిగ్గు చేసెఁ


తే.

దనవిభవలక్ష్మి మిత్రబాంధవకవీంద్ర, నీలపంకేరుహంబుల నెలవు చేసె
బసవశంకరజగరక్షపాలబిరుద, ధనుఁడు రావూరిపేరయతమ్మవిభుఁడు.[2]

34


క.

ఆతమ్మక్షితిపాలుఁడు, పాతివ్రత్యమున సకలభాగ్యశ్రీలన్
సీతకుఁ బ్రతి వచ్చినవి, ఖ్యాతగుణాలంబ మాచమాంబ వరించెన్.[3]

35


తే.

ఆవధూటికి నుదయించి రమితగుణస, మగ్రవైభవు లత్యంతమహితయశులు
బసవశౌరియు నన్నయప్రభువరుండు, లింగవిభుఁడు ననంగ నుత్తుంగయశులు.[4]

36


క.

వారలలోపల బసవ, శ్రీరమణుఁడు పేరుపెంపు గలమన్నీఁడై
భూరిప్రతాపజయల, క్ష్మీరతుఁడై వెలసె నుదయగిరిరాజ్యమునన్.[5]

37


సీ.

కుటిలతరారాతికుంభినీధవమహాభూభృత్కదంబరంభోళిధరుఁడు
దారుణాహితపయోధరపాటనవ్యగ్రబంధురఝంఝాప్రభంజనుండు
పటుతరప్రతిపక్షపక్షఘోరారణ్యసముదగ్రచటులవైశ్వానరుండు
కఠినాహితవ్రాతగాఢాంధకారలుంటాకప్రచండప్రభాకరుండు

  1. పెంపు = అభివృద్ధి, సౌంపు = బాగు, యశము = కీర్తి, ప్రస్తుతి సేయ = పొగడఁగా.
  2. దిగ్ధరణీళకోటీరసముదయంబులకు =ఎల్లదిక్కులయందు నుండెడు రాజులయొక్క కిరీటములయొక్క సమూహములకు, సముద్యద్దర్పవిద్వేషిజగతీశులకున్ = పూనికయు గర్వమును గలశత్రురాజులకు, తారకాధనతారకాతారవసుధాధరములకున్ = చంద్రునకును నక్షత్రములకును వెండికొండకును, మందారగుహ్యకరాజశిబిదధీచులకున్ = కల్పవృక్షకుబేరచంద్రశిబిచక్రవర్తిదధీచిమునులకు, వీరు మిక్కిలి దాతలని చెప్పుదురు, నీలపంకేరుహము = నల్లకలువ, ఇట్టిచోట్ల పంకేరుహశబ్దమునకు కమల మని యర్థము చెప్పుట సరి కాదు, నెలవు = స్థానము, బసవశంకరజగరక్షపాలబిరుదధనుఁడు = ఇది బిరుదును తెలుపునది కాన జగరక్షపాల యనునది దుష్టముగా గ్రహింపదగదు.
  3. పాతివ్రత్యము = పతివ్రతాత్వము, విఖ్యాతగుణాలంబ = ప్రసిద్ధగుణములకు అవలంబమైనది.
  4. ఉత్తుంగయశులు = అధికకీర్తి గలవారు.
  5. మన్నీఁడు = రాజు (మన్నెము = పర్వాదాయము ననుభవించదగినభూమి) అది కలవాఁడు అని వ్యుత్పత్యర్థము.