పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వేది సారస్యవిద్యాప్రవీణు సుకవి, మాననీయుని సూరనామాత్యవరుని.[1]

23


క.

నన్నుఁ బిలిపించి పెద్దయు, మన్నించి గురూపచారమార్గంబులు సం
పన్నములు చేసి వినయము, దన్నెంతయుఁ బ్రోదిసేయఁ దగ నిట్లనియెన్.[2]

24


క.

నీ విప్పు డాంధ్రభాషం, గావించుచు నున్న చంపుకావ్య మ్మగునీ
శ్రీవిష్ణుపురాణము నా, కీవలయు మరియకీర్తి యిలలో నెగడన్.[3]

25


క.

క్షితిలోనఁ బసిఁడి పరిమళ, యుతమై రత్నమును గూడి యున్నట్లు సుమీ
కృతి శ్రీవిష్ణుపురాణము, కృతికర్తవు నీవు నేను గృతిపతి నగుటల్.[4]

26


వ.

అని బహుమానపూర్వకంబుగా గంధాక్షతంబు లొసంగి కనకమణిభూషణాం
బరంబులు గట్టనిచ్చి కర్పూరసహితంబుగాఁ దాంబూలంబు సమర్పించి తమతం
డ్రిపేర బసవాపురం బనునగ్రహారం బేకభోగంబుగా నొసంగి గౌరవించిన
నేనును బరమసంతోషపరిపూర్ణహృదయుండనై మదీయప్రణీతకావ్యకన్యా
మనోహరుం డగురావూరిబసవభూపాలురాఘవువంశం బభివర్ణించెద.[5]

27


ఆ.

జలజనాభునాభిజలజాతమున బ్రహ్మ, జనన మొందె నతనిచరణపంక
జమున శూద్రజాతి జన్మించి వారిల, యందుఁ బంటవంశ మతిశయిల్లె.[6]

28


ఆ.

అట్టిపంటకులంబునందు నేడవచక్ర, వర్తి యన్న వేమవసుమతీశుఁ
డుద్భవించి కీర్తియును సత్ప్రతాపంబు, నెసఁగ భూమియెల్ల నేలుచుండె.[7]

29


క.

తనబ్రతుకు భూమిసురులకుఁ, దనబిరుదులు పంటవంశధరణీశులకున్
దననయము భూమిప్రజలకు, ననవేమన యిచ్చెఁ గీర్తి నధికుం డగుచున్.[8]

30


క.

ఆపంటవంశమునఁ గుల, దీపకుఁ డగులింగశౌరి తేజోధికుఁడై
యేసారెఁ గీర్తిలక్ష్మికిఁ, బ్రాపై తొల్లింటిరెడ్డిరాజులకరణిన్.[9]

31


క.

ఘనుఁ డాలింగారెడ్డికి, తనయుఁడు కీర్తిప్రతాపధాముఁడు తేజో
ధనుఁడై పేరమరెడ్డి సు, జనవినుతుఁడు పుట్టె భాగ్యసంపద వెలయన్.[10]

32


క.

పేరుగల లింగయప్రభు, పేరన నుదయించె సుతుఁడు పెంపున్ సొంపున్

  1. నయవిశారదుఁడు = నీతివిద్యయందు నేర్పరి, పరమ సాత్వికోదయహృదయంన్ = శ్రేష్ఠమైన సాత్వికగుణములకు జనస్థానమైన హృదయముగలవానిని - మిక్కిలి సాత్వికగుణము కలవానిననుట, సారస్యములు = సరసభావము.
  2. పెద్దయున్ = మిక్కిలి, గురూపచారమార్గంబులు = గొప్పయుపచారములను నడపెడుతోవలను, సంపన్నములు = కలిమి కలవి - గొప్పయుపచారములను నడపి యనుట, ప్రోది సేయన్ =గొప్పపఱుపఁగా.
  3. చంపుకావ్యము = పద్యములును వచనములును గల కావ్యము, ఇలలోన్ = భూమియందు, నెగడన్ = వ్యాపింపఁగా.
  4. పసిఁడి = బంగారు, కృతికర్త = ప్రబంధరచన చేయువాఁడు, కృతిపతి = ప్రబంధమును రచింపించినవాఁడు.
  5. కనకమణిభూషణాంబరంబులు = బంగారుమయములును రత్నమయములునగు సొమ్ములను వస్త్రములను, మదీయప్రణీతము = నాచేఁ జేయఁబడినది.
  6. జలజనాభుఁడు = విష్ణువు, చరణవంశజమున = పాదకమలమునందు.
  7. సత్ప్రతాపము = మేలైవప్రతాపము.
  8. నయము = నీతి.
  9. ఏపారి = అతిశయించి, ప్రాపు = రక్షకము.
  10. కీర్తిప్రతాపధాముఁడు = కీర్తికిని ప్రతామునకును ఇల్లయినవాఁడు, తేజోధనుఁడు = పరాక్రమమే ధనముగాఁ గలవాఁడు.