పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


బలసి కొలువంగ నతులవైభవముతోడ, రమణఁ గొలువుండె బసవయరాఘవుండు.[1]

17


సీ.

కరమూలరుచులబింకపుఁబంకజాక్షులు రమణతో వింజామరములు వీవ
గుబ్బపాలిండ్లనిగ్గులు దేరు నొకయింతి ప్రమదంబుతోకో నడపంబుఁ బూర
వాలుచూపులచే నివాళించి యొకలేమ కాళాంజిపూని చెంగట నటింప
పంచమస్వరమునఁ బద్మాక్షి యొక్కతె యవధారు చిత్తేశ యనుచుఁ బలుక


తే.

లలితబిబ్బోకహేలావిలాసములను, రాజబింబాస్య లుభయపార్శ్వములఁ గొలువ
రాజసంబున బసవయరాఘవుండు, నిండుకొలువుండెఁ గన్నులపండు వగుచు.[2]

18


క.

పౌరాణికు లఖిలకళా, పారీణులు బహుపురాణపద్ధతు లతిగం
భీరోక్తుల వినిపింపఁగ, గౌరవమున వినుచుఁ బరమకౌతుక మొప్పన్.[3]

19


క.

అనవేమమండలేశ్వరుఁ, డును నళ్లయ వీరభద్రుఁడును మొదలుగఁ గ
ల్గినతొంటిరెడ్డిరాజులు, ఘనకీర్తులు గనిరి కృతిముఖంబున ననుచున్.

20


తే.

కృతిముఖంబునఁ దానును గీర్తివడయఁ, బూని పెద్దలయనుమతంబునఁ దెనుంగు
బాస విష్ణుపురాణ ముపన్యసింప, సరసుఁ డైనట్టిసత్కవీశ్వరుని నరసి.[4]

21


ఉ.

ఈనిఖిలంబు మెచ్చ నమరేశ్వరదేవుఁడు చూడఁ గృష్ణవే
ణీనది సాక్షిగా పనికి నిల్చినరావుతుఁ గేసభూవిభుం
గానకుఁ దోలి వెన్నడిచి కాచినవేమయయన్నపోతభూ
జానికి సత్ప్రబంధము లొసంగిన వెన్నెలగంటివారిలోన్.[5]

22


సీ.

భవ్యచరిత్రు నాపస్తంబమునిసూత్రు, శుద్ధపారస్వతస్తోత్రపాత్రు
హరితగోత్రపవిత్రు నాంధ్రభాషాకావ్యరచనాభినయవిశారదుఁ బ్రబంధ
కర్తను వెన్నెలకంటిసూర్యునిమనుమనిఁ జెరుకూరియమరయమంత్రి
సత్పుత్రు నాశువిస్తారవిచిత్రమాధుర్యకవిత్వచాతుర్యశీలు


తే.

నిజకులాచారమార్గికనిపుణుఁ బరమ, సాత్వికోదయహృదయు వైష్ణవపురాణ

  1. వేదాంతవిదులు = వేదాంతము నెఱిఁగినవారు, ఒకవంక = ఒకతట్టు, ఉభయభాషాకవులు = సంస్కృతాంధ్రకవులు, ఉదుటు = గర్వము, మన్నెకొమారులు = రాజపుత్రులు - లేక, సామంతరాజపుత్రులు, తజ్ఞులు = భరతశాస్త్రము నెఱిఁగినవారు, రమణన్ = ఒప్పిదముగా.
  2. కరమూలరుచులు = చంకలయందలికాంతులు, నిగ్గులు దేరు = వన్నెమీఱు, నివాళించి = ఆరతులెత్తి, కాళాంజి = కమ్మపడిగము, అవధారు = అవధరింపుము, చిత్తేశ = మనోనాయకా, బిబ్బోకము = స్త్రీలయొక్క విలాసవిశేషము, రాజబింబాస్య = చంద్రబింబమువంటి ముఖముకలది, కన్నులపండువు = నేత్రోత్సవము.
  3. అఖిలకలాపారీణలు = ఎల్లవిద్యలు తుదముట్ట నెఱిఁగినవారు.
  4. కృతిముఖంబునన్ = గ్రంథమూలమున, ఉపన్యసింపన్ = చెప్ప, అరసి = విచారించి.
  5. వెన్నడిచి = వీఁపు తట్టి, భూజాని = రాజు.