పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ధానంబునుం జేసి శ్రీవిష్ణుపురాణనిర్మాణప్రవీణహృదయుండనై యుండునప్పుడు
సకలసముద్రముద్రితాఖిలవసుంధరాచక్రపరిపాలనపరాయణుండును, రూప
నారాయణుండును, చటులకుటిలవిరోధియూధగహనధనంజయుండును, సంగ్రా
మధనంజయుండును, సంగరోత్సాహసంగతచతురంగసేనాసమేతారాతిగర్వాం
ధకారసముజ్జ్వలాదిత్యుండును, పల్లవాదిత్యుండును, సముద్దండప్రచండవిరోధి
మండలేశ్వరప్రాణానిలమండలాగ్రభుజంగుండును, రాయవేశ్యాభుజంగుం
డును, అనవరతసుకవినికరస్తోత్రవచనరచనాసమయనిర్వికారుండును, చంచుమల
చూఱకారుండును, వేదశాస్త్రపురాణప్రవీణభూసురాశీర్వాదప్రవర్ధమాన
గోత్రుండును, యానపాలగోత్రుండును, పంటవంశపయఃపయోరాశిరాకాశర్వ
రీశ్వరుండును, రావూరిపురవరాధీశ్వరుండును నైనబసవభూపాలురాఘవుండు.[1]

15


సీ.

గౌరీసమేతుఁడై గరిమతో నేవీట నేపారు నీలకంఠేశ్వరుండు
వారాశికన్యతో వర్ణించు నేవీట గిరిభేదినుతుఁ డైన కేశవుండు
యోగినీసహితయై యొప్పారు నేవీటఁ బసిఁడిపోలేరమ్మ భవునికొమ్మ
పాపవినాశయై ప్రవహించు నేవీట మన్నేఱు మిన్నేటిమారటగుచుఁ


ఆ.

గుంజరములు వేయి గొలువంగ నేవీటఁ, గొడగుచక్రవర్తి పుడమియేలె
నట్టిరాజధాని యై యొప్పు గుడ్లూరి, నొనర నేలుచుండి యొక్కనాఁడు.[2]

16


సీ.

వేదాంతవిదులైన విద్వాంసు లొకవంక నుభయభాషాకవు లొక్కవంక
సకలాప్తబాంధవసంబంధు లొకవంక నుదుటుమన్నెకొమారు లొక్కవంక
నీతికోవిదులైన నెఱమంత్రు లొకవంక నుద్దండరణశూరు లొక్కవంక
సంగీతసాహిత్యసర్వజ్ఞు లొకవంకఁ జొక్కపుభరతజ్ఞు లొక్కవంక


తే.

రాజరాజులు పంచిన రాయబారు, లొక్కవంక విలాసిను లొక్కవంక

  1. ముద్రితము = ముద్ర వేయఁబడినది - ఆవరింపఁబడినదనుట, పరాయణుఁడు = ఆసక్తుఁడు, చటులకుటిలవిరోధియూధగహనధనంజయుండు = గడుసైనవారును చెడ్డనడతగలవారునకు పగవారిగుమి యనెడు అడవికి అగ్నిహోత్రుడైనవాఁడు, సంగ్రామధనంజయుఁడు = యుద్ధమునందు అర్జునుఁడు, సంగరము = యుద్ధము, సంగతము = కూడుకొన్నది, ఆరాతి = శత్రువు, పల్లవాదిత్యుఁడు = బాలసూర్యుఁడు, సముద్దండప్రచండవిరోధిమండలేశ్వరప్రాణానిలమండలాగ్రభుజంగుండు = గర్వించిన ప్రతాపవంతులగు శత్రురాజులయొక్క ప్రాణవాయువులను (హరించునట్టి) కత్తియనెడు సర్పముగలవాఁడు, రాయవేశ్యాభుజంగుండు = భోగమునారికి విటుఁడు, చూఱకారుఁడు = కొల్లపెట్టినవాఁడు, ఈరెండును బిరుదుపేళ్లు, ఇట్టివి గ్రామ్యములైనను గ్రహింపఁబడును. గోత్రము = భూమి-వంశము, పంటవంశపయఃపయోశిరాకాశర్వరీశ్వరుఁడు = పంటవంశమనెడు పాలసముద్రమునకు పున్నమనాటిచంద్రుఁడు.
  2. గరిమ = గౌరవము, వీటన్ = పట్టణమునందు, వారాశికన్య = లక్ష్మి, గిరిభేది = ఇంద్రుడు, మారట = మాఱు, కుంజరము = ఏనుఁగు.