పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దానవవైరి ముందరఁ బ్రతాపముఁ జూపగ రాదు కావునన్
మానుము దుర్విచారము మనంబున నెమ్మెయి మానకుండినన్
మానముఁ గోలుపోదు వనుమానము మాను మనం గలంగుచున్.[1]

292


మ.

అతఁ డక్రూరునిపాలి కేగి తనకార్యంబంతయుం జెప్పి య
చ్యుతునిన్ మార్కొనిపోరఁ దోడుపడుమంచున్ బిట్టు ప్రార్థించినన్
శతధన్వా యెటువంటిదుర్మతివి నీసామర్థ్య మాశౌరిపై
మతి నూహింప వినాశహేతువగు నీమాటల్ వినంగూడునే.[2]

293


వ.

అదియునుంగాక యమ్మహాత్ముండు నిశాచరాధిపశుద్ధాంతకాంతావైధవ్యకారణా
వక్రవిక్రమోపక్రమచక్రపాణియును, పాపప్రహారప్రకంపితజగత్ప్రయప్రాణి
యును, పురందరాదిదిక్పాలకఫాలపట్టికాసంఘటితపదారవిందుండును, సనకస
నందనాదిభక్తజనవిందుండును నైన గోవిందుం డెవ్వరికి నజేయుండు గావున
బుద్ధిమంతుండవై యెటకేనియుం దొలంగిపొమ్మనిన నొడంబడి యతం డిట్లనియె.[3]

294


ఉ.

ఏ నెటకేనియుం దొలఁగి యేగెద నీమహనీయరత్నమున్
మానుగ నీవు దాఁపుము రమాపతిబారికిఁ దప్పి వచ్చినన్
గానుక నాకు నిచ్చె దిటుగా కొకటైనను నిన్నె చేరెడుం
గాని కడున్ రహస్యముగఁ గైకొనుమా నిను నమ్మి యిచ్చెదన్.[4]

295


చ.

అని తన చేతిరత్నముఁ బ్రయత్నము మీఱఁగ నిచ్చె నిచ్చినన్
మనమున సంతసిల్లియు సమంజసబుద్ధిఁ దలంచి యింక నీ
పని యొరుతోడఁ జెప్పనని బాస యొనర్చినఁ గాక యొల్ల నే
ననుటయు నట్లకాక యని యాతనికిన్ శపథంబు పల్కినన్.[5]

296


ఆ.

సంతసిల్లి యాశమంతకం బతిరహ, స్యంబు గాఁగ దాఁచె నంతలోనఁ
దన్నుఁ బట్టికొనఁగఁ దగువారిఁ గృష్ణుండు, పనుచు టెఱిఁగి యతఁడు భయము గదుర.

297


క.

అతితీవ్రవాయువేగియు, శతయోజనవాహినియును సమధికసత్వో
ద్ధతియును నగుగోడిగఁ దా, శతధన్వుం డెక్కి చనియె సత్వరవృత్తిన్.[6]

298


వ.

అంత బలదేవుండు దోడురా వాసుదేవుండు సైన్యసుగ్రీవమేఘపుష్పవరాహ

  1. దుర్విచారము = చెడ్డయాలోచన.
  2. బిట్టు = మిక్కిలి.
  3. నిశాచరా...చక్రపాణి = రాక్షసరాజులయొక్క యంతఃపురస్త్రీల విధవత్వమునకు కారణమైన ఋజువైనపరాక్రమమును జూపుటకు చక్రమును చేతఁబట్టినవాఁడు, పాపప్రహారప్రకంపితజగత్ప్ర యప్రాణి = పాపమును (తొలఁగ) కొట్టుటచేత వణఁకఁజేయఁబడిన మూడులోకములలోని ప్రాణులును గలవాఁడు, ఫాలపట్టికాసంఘటిత = పట్టెలవంటి నొసళ్లయందుఁ జేర్పఁబడిన, విందుఁడు = తెలిసికొనువారుగాఁ గలవాఁడు.
  4. దాఁపుము = దాఁచిపెట్టుము.
  5. బాస = ప్రమాణము.
  6. గోడిగన్ = ఆడుగుఱ్ఱమును.