పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దానికి సామవాదముల సత్రాజిత్తుఁ డీనేరఁడని కదా యిప్పు డతని
తమ్మునిఁ జంపి రత్నముఁ దెచ్చుకొన్నవాఁ డింతసాహసకృత్య మెవ్వఁ డోపుఁ


తే.

బరులవలనఁ గీడు వొరసినఁ జెడకుండఁ, నాదరమునఁ బ్రోచు నవ్విభుండు
తానె కరుణ మాని దండించువాఁడగు, నేని సుజనవర్గ మేమి సేయు.[1]

256


వ.

అని యిట్లు పలుకుచున్న లోకాపవాదంబునకు వెఱచి నారాయణుండు.

257

శ్యమంతకమణిమూలంబున శ్రీకృష్ణునకు జాంబవతీసత్యభామలు భార్య లగుట

సీ.

సేనలుఁ దాను బ్రసేనుండు మును గానకరిగినచొప్పున నరిగి యొక్క
యెడ మృగేంద్రునిచేతఁ గెడసిన యానిఘ్నసుతు నెల్లవారికి జూపి సింహ
పదమార్గమున నేగి భల్లూకనిహతపంచాస్యకళేబర మచటఁ గాంచి
ఋక్షవల్లభుజాడ నేగి ముందఱ నొక్కగిరిగహ్వరముఁ గని కేశవుండు


తే.

నిఖిలబలమును నచ్చోట నిలిపి బిలము, దఱియఁ జొచ్చి కొండొకనేల యరిగి యచట
గాంచె నానామణిప్రభాకలితమహిమ, తోరమైయున్న జాంబవంతునిపురంబు.[2]

258


క.

అక్కడ నొక్కకుమారుని, నక్కున నిడి యొక్కదాది యనురాగముతో
మిక్కిలి నుపలాలింపగ, నక్కమలాక్షుండు వినియె నవ్వాక్యంబుల్.[3]

259


(శ్లో.

సింహః ప్రసేనమవత్సింహో జాంబవదా హతః,
సుకుమారక మా రోదీ స్తవ హ్యేష శమంతకః)


ఆ.

హరి ప్రసేనుఁ జంపె నమ్మృగేంద్రంబును, జాంబవంతుచేతఁ జచ్చె నిపుడు
గలిగే నీశమంతకము నీకు సుకుమార, యేడు పుడుప వన్న యింకనైన.

260


వ.

అని యిట్లు పలుకుచున్న దాది పలుకు లాకర్ణించి ముందట.

261


తే.

జలజనాభుఁడు పొడఁ గాంచె జాంబవత్కు, మారుకంఠప్రదేశమం దంచితప్ర
భావిభాసితమై నూత్నభానురుచికి, మాఱుమలయుచు నున్నశమంతకంబు.[4]

262


క.

చేరంగవచ్చి శౌరి కుమారునికంఠమున నున్నమణిరత్నము దు
ర్వారగతిఁ బుచ్చుకొన్న మ, హారభసముతోడ దాది యాక్రోశించెన్.[5]

263


ఆ.

అంత జాంబవంతుఁ డత్యంతదారుణ, కోపదీప్తుఁ డగుచు నాపురాణ
పురుషవరునితోడఁ బోరాడె నేకవిం, శతిదినంబు లతులసాహసమున.

264


చ.

వనరుహనాభురాక గరువంబునఁ గోరుచు సేనలెల్ల నే

  1. సామవాదములన్ = మంచిమాటలతో, ఒరసినన్ = కలిగినను.
  2. కెడసిన = చచ్చిన, భల్లూకనిహతపంచాస్యకళేబరము = ఎలుగుగొడ్డుచేత చంపఁబడిన సింహముయొక్క దేహమును, గహ్వరమున్ = గుహను, తోరము = అధికము.
  3. అక్కునన్ = ఱొమ్మునందు, ఉపలాలింపఁగన్ = బుజ్జగింపఁగా.
  4. అంచితప్రభావిభాసితము = ఒప్పిదమైన కాంతిచేత ప్రశాశించునది. నూత్నభానురుచిన్ = బాలసూర్యునివెలుఁగునకు, మాఱుమలయుచున్ = ప్రతిఘటించుచు.
  5. దుర్వారగతిన్ = అడ్డములేనివిధమున, మహారభసముతోడన్ = మిక్కిలితత్తఱపాటుతో, ఆక్రోశించెన్ = ప్రలాపించెను.