పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బై నాదృష్టికిఁ దోఁచుచున్నయది దివ్యంబైనయాకారముం
గానం జేసి కృతార్థుఁ జేయు మని భూకాంతుండు ప్రార్థించినన్
భానుం డెంతయు నాదరం బొదవ సంభావించి సంప్రీతితోన్.[1]

239


క.

తనగ్రైవేయకములలో, ఘనతేజము గల శమంతకంబనురత్నం
బొనరఁగ దెచ్చి రహస్యం, బున నాతనికంఠలగ్నమును జేయుటయున్.[2]

240


క.

మిత్రుని నీషత్పింగళ, నేత్రుని నత్యంతవామనీకృతసమ్య
గ్గాత్రునిఁ గవిజనమతిస, త్పాత్రునిఁ బొడగాంచె లోకబాంధవు సూర్యున్.[3]


ఆ.

చూచి పెక్కు గతులఁ జొక్కుచు ముందర, నున్ననతనితోడ నొక్కవరము
నిత్తు వేఁడుమనిన నీశమంతకరత్న, మిమ్మటన్న నిచ్చి యినుఁడు సనియె.

242


వ.

సత్రాజిత్తుండును లోకబాంధవదత్తం బైనశమంతకరత్నంబు నాయకరత్నంబుగాఁ
గంఠమాలికయందు నిడి మగిడి ద్వారకాపురంబునకు వచ్చుచున్నంతఁ దదీయ
రత్నప్రభాజాలంబులవలన రెండవసూర్యుండునుంబోలె నశేషసముద్భాస
మానుం డైనవానింజూచి పౌరజనంబు లత్యాశ్చర్యధుర్యాయత్తచిత్తులై చని.[4]

243


మ.

భవసంహారుని నాదిదేవుని మహీభారావతారక్రియా
ప్రవణవ్యాజమనుష్యరూపుని నదభ్రప్రాభవోద్దామవై
భవతేజోవిభవప్రతాపుఁ గరుణాపారీణునిన్ యాదవ
ప్రవరుం గృష్ణునిఁ గృష్ణవర్ణతనునిం బద్మాయతాక్షున్ హరిన్.[5]

244


క.

కని దండనమస్కారము, లొనరించి కరములు మొగిచి యోదేవ దివం
బున నున్నసూర్యదేవుఁడు, చనుదెంచుచు నున్నవాఁడు సాంద్రప్రభలన్.[6]

245


వ.

అనినం ద్రికాలవేది యగు దామోదరుండు దరహసితవదనుం డగుచు వారలతో
నిట్లనియె.[7]

246


క.

రాజీవాప్తుఁడుగాఁడు ప, యోజహితుం బ్రీతుఁ జేసి యొకరత్నము స
త్రాజిత్తుడు గొనిరాఁ ద, త్తేజంబు వెలింగె నిట్టి దీప్తిచ్ఛటలన్.

247
  1. ఉగ్రాగ్నిపిండోపమంబు = తీక్ష్ణమైన నిప్పుముద్దవంటిది.
  2. గ్రైవేయకము = కంఠభూషణము, కంఠలగ్నము = మెడను పొందినది యగునట్టుగా.
  3. ఈసత్పింగళనేత్రునిన్ = కొంచెము పసుపువన్నె గల కన్నులుగలవానిని, అత్యంతవామనీకృతసమ్యగ్గాత్రునిక్ = మిక్కిలి పొట్టిగా చేయఁబడిన మంచిదేహము గలవానిని.
  4. అశేషదిశాసముద్భాసమానుండు = ఎల్లదిక్కులయందు చక్కగా ప్రకాశింపుచున్నవాఁడు.
  5. భవసంహారునిన్ = పుట్టుకలను మాన్చువానిని, మహీభారావతారక్రియాప్రవణవ్యాజనునుష్యరూపునిన్ = భూభారమును దించుటయనెడుపనియందలి యాసక్తతయనెడు నెపముచేత నైన మనుష్యరూపము గలవానిని, అదభ్రప్రాభవోద్ధామవైభవతేజోవిభవప్రతాపున్ = అల్పము కానిమహిమయు, అధికమైన యైశ్వర్యమును, తేజోవైభవమును, పరాక్రమమును గలవానిని.
  6. దివంబునన్ = ఆకాశమునందు.
  7. త్రికాలవేది = భూతభవిద్యద్వర్తమానము లనెడు మూడుకాలముల నెఱిఁగినవాఁడు.