పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చైద్యులై ధరణిఁ బ్రశస్తి కెక్కిరి వారిచేత నాదేశంబు చేదిదేశ
మన నొప్పెఁ గ్రథకైశికున కిందుమతి యనుకూఁతుకుఱ్ఱయు మఱి కుంతి యనఁ గు


తే.

మారుఁడును గల్గి రాయిందుమతిఁ గకుత్స్థ, వంశజుం డైనయజుఁడు వివాహమయ్యె
గుంతి యత్యంతభోగనిరంతుఁ డగుచు, ధరణిఁ బాలించెఁ గడలేనిధర్మములను.[1]

231


వ.

ఆకుంతికి వృష్ణియు నతనికి ధృతియును ధృతికి దాశార్హుండును నతనికి వ్యోముం
డును వానికి ననుండును ననునకుఁ బూరుహోత్రుండును వానికి నంశుండును
నతనికి సత్వతుండును నతనికి సాత్వతుండునుం బుట్టిరి.

232


క.

జ్యామఘువంశానుక్రమ, భూమీశులకథలు భక్తిపూర్వకముగ ని
చ్ఛామతుల విన్నవారికి, నేమియుఁ బాపములు సెంద వేకాలమునన్.

233


వ.

మఱియు సాత్వతునకు భజమానదివ్యాంధదేవావృధమహాభోజవృష్ణు లనంగ
నార్వురు పుట్టి రందు భజమానునకు నిమియును వృక్ణుండును వృష్ణియు శత
జిత్తును సహస్రజిత్తును యుతజిత్తును ననంగ నార్వురుకుమారులు పుట్టిరి
మఱియును.

234


క.

దేవావృధునకు బభ్ర్యుడు, దేవవిభుం డుద్భవించె దీప్తయశుండై
యావసుధేశుని చరితము, లీవార్ధిపరీతభూమియంతయు నెగడెన్.[2]

235


వ.

మఱియు మహాధర్ముం డైనమహాభోజునకు భోజమూర్తులు పుట్టిరి. వృష్ణికి
సుమిత్రుండు పుట్టె వానికి నమిత్రుండును శిబియునుం బుట్టి రందు నమిత్రు
నకు నిఘ్నుండు పుట్టె వానికిఁ బ్రసేనసత్రాజిత్తులనంగ నిరువురు పుట్టి రందు
సత్రాజిత్తుండు.

236

సత్రాజిత్తునకు సూర్యునివలన శ్యమంతకమణి లభించుట

మ.

వనజాతప్రభవాండపూరితమహాధ్వాంతప్రణాశప్రభా
ఘనసాహస్రగు నబ్దమాససకళాకాష్ఠానిమేషాదికా
లనియుక్తుం బరముం బరాపరకళాలక్షీకృతుం జిత్రభా
నుని నారాధన సేసె రాజితతపోనుష్టానకర్మంబులన్.[3]

237


తే.

అతనిసద్భక్తియుక్తికి నాత్మ మెచ్చి, నీరజాప్తుండు ముందర నిలుచుటయును
దుర్నిరీక్ష్యప్రభలచేతఁ దోఁచుచున్న, దేవదేవునిఁ గానక దృష్టి చెదరి.[4]

238


శా.

ఓనారాయణమూర్తి నీమహిమ నే డుగ్రాగ్నిపిండోపమం

  1. నిరంతుఁడు = అంతము లేనివాఁడు.
  2. వార్ధిపరీత = సముద్రముచే ఆవరింపఁబడిన.
  3. వనజాతప్రభవాండపూరితమహాధ్వాంతప్రణాళప్రభాఘనసాహస్రగున్ = బ్రహ్మాండమునందు నిండిన దట్టమైనదీఁకటిని చెఱుచునట్టి వెలుఁగుచేత ఘనమైన వేయికిరణములు గలవానిని, పరమున్ = సర్వోత్కృష్షు డైనవానిని, పరాపరకళాలక్షీకృతున్ = పరావరవిద్యలచేత సాక్షాత్కరింపఁబడినవానిని, చిత్రభానునిన్ = సూర్యుని.
  4. నీరజాప్తుండు = సూర్యుఁడు, దుర్నిరీక్ష్యప్రభలచేతన్ = చూడశక్యముగాని కాంతులచేత.