పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

బ్రాహ్మణుని బలవీర్యసంపద నిరర్థ, కంబు భూలోకమంతయు ఘనపరాక్ర
మప్రతాపంబు లేపార మహిమతోడ, నేలు నాపుత్రుఁ డది నీకు మేలుగాదె.[1]

130


వ.

అని బేలు పెట్టి కూతురుం దానును జరుద్వయంబు వీడుపడ నుపయోగించి నిజ
గృహంబులకుం జని రంత.[2]

131


చ.

వనముననుండి వచ్చి భృగువంశశిఖామణి భార్యఁ జూచి నీ
జననియు నీవు నాపలుకుచందముఁ దప్పిచరుద్వయంబు నే
డొనరఁగ మార్పడంగ నుపయోగము చేసితి రింతయేల పో
వనరుహనేత్ర రౌద్రగతి వర్తిలుచున్నది నీదుగర్భమే.

132


మ.

భయదక్షత్రియకర్మఠుండును మహాభాగుండు శస్త్రాస్త్రపా
ణియుఁ గానున్నసుతుండు పుట్టెడుసుమీ నీయందు వేదాంతవే
దియు నత్యంతతపోధనుండు నవనీదేవాన్వయాచారవ
ర్తియుఁ గానున్నతనూభవుండు గలుగుం దెల్లంబు మీతల్లికిన్.[3]

133


చ.

అనవుడు వేఁడినిప్పువలె నవ్వచనంబు మృగాక్షి నెమ్మనం
బునకు నసహ్యమైన మునిముఖ్యుపదంబులమీఁద వ్రాలి యో
యనఘ భవత్ప్రసాదజనితాత్మజుఁడే యిటువంటిక్రూరక
ర్మనిరతుఁ డప్రబుద్ధ నపరాధిని నన్ను ననుగ్రహింపవే.[4]

134


క.

మీపలికినట్టివన్నియు, నాపుత్రునియందు వలదు నరవరధర్మ
వ్యాపారము మనుమనియం, దాపాదింపుదురు కాని యని పలుకుటయున్.[5]

135


వ.

అట్ల కాక యని యనుగ్రహంబు సేసిన కొండొకకాలంబునకు నాసత్యవతి జమదగ్ని
నిం గాంచెఁ దదీయజనని విశ్వామిత్రుం గాంచె నంత నారుచికుండు తపోవనంబు
నకుం జనియె సత్యవతి కౌశికి యనుపుణ్యనదియై ప్రవహించె జమదగ్నియు నిక్ష్వాకు
వంశసంభవుండైన రేణువను రాజుపుత్రియైన రేణుకను వివాహంబై దానియందు.[6]

136


మ.

 సకలక్షత్రకులప్రభంజనకళాసంపన్నబాహాబల
ప్రకటీభూతసమస్తలోకుఁడు మహీభారావతీర్ణప్రభా

  1. ఏపారన్ = అతిశయింప.
  2. బేలు పెట్టి = వంచించి, వీడు పడన్ = మాఱుపడ.
  3. భయదక్షత్రియకర్మఠుండు = భయంకరమైన క్షత్రియకర్మలను నడపువాఁడు, మహాభాగుఁడు = గొప్పతనమును వహించినవాఁడు, వేదాంతవేది = ఉపనిషదర్థముల నెఱింగినవాఁడు, అవనీదేవాన్వయాచారవర్తి = బ్రాహ్మణవంశస్థులనడవళ్లు గలిగి వర్తించువాఁడు, తెల్లంబు = స్పష్టము.
  4. అసహ్యము = సహింపరానిది, వ్రాలి = పడి, భవత్ప్రసాదజనితాత్మజుఁడే = నీయనుగ్రహముఁవలనఁ బట్టిన కొడుకా, అప్రబుద్ధన్ = అజ్ఞానురాలను.
  5. ఆపాదింపుదురు = కలుగఁజేయుదురు.
  6. కొండొక = కొంత