పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కోశాదినానామహిమలు నూర్వశీసాలోక్యంబుం గలుగునట్లుగా వేఁడిన నను
గ్రహించి యొక్కయగ్నిస్థాలి యచ్చి యిట్లనిరి.[1]

106


మ.

మనుజాధీశ్వర యిమ్మహానలము నామ్నాయానుసారక్రమం
బునఁ ద్రిత్వం బొనరించి యాగము జగత్పూతంబుగాఁ జేయు మా
ఘనపుణ్యంబున నీకు నిట్టిమహిమల్ గల్గుం జుమీ యూర్వశీ
వనీతాసంగమవైభవస్థితులతో వాంఛాసముద్వృత్తమై.[2]

107


వ.

అని చెప్పి గంధర్వులు వోయిన బుధనందనుండు నగ్నిస్థాలిఁ గైకొనివచ్చి బహు
విచారభ్రాంతివలనం జిత్తంబు గలంగి తనలో నిట్లనియె.

108


మ.

నను గంధర్వవరుల్ వరం బడుగుమన్న దుర్వివేకంబుతో
ననలస్థాలియ కొంటిఁగాని ప్రమదం బారంగ నీయూర్వశీ
వనజాతేక్షణ నాకు నిం డనుచు నే వాంఛింపలేనైతి నె
ట్టన నాయత్నము కొండఁ ద్ర వ్వెలుకఁ బట్టంబోయిన ట్లయ్యెఁగా.

109


ఉ.

ఎక్కడియజ్ఞకర్మ మిఁక నెక్కడియూర్వశి యేడ జీవనం
బెక్కడి కెక్కడంచు మది నెంతయు రోసి వనాంతరంబులో
నొక్కెడ నమ్మహానలము నుంచి పురంబున కేగి యాత్మలోఁ
బొక్కుచు నర్ధరాత్రమున బుద్ధిఁ దలంచుచు నాతఁ డిట్లనున్.

110


మ.

కృప గంధర్వులు నాకు నిచ్చిన మహాగ్నిస్థాలి య ట్లేటి కా
విపినాంతంబున వైచి వచ్చితి మనోవిశ్రాంతి దుర్యత్నముల్
విపరీతంబునఁ దోఁచెఁ బోయినపనుల్ వే చెప్పగానేల నే
నిపు డచ్చోటికిఁ బోయి తెచ్చి సవనం బీడేర్తు సాంగంబుగన్.

111


సీ.

అని యిట్లు దలపోసి యాప్రొద్దె కదలి యయ్యడవిలోనికి వచ్చియగ్ని నచటఁ
గానక యొకశమీగర్భస్థమై యున్నయశ్వత్థభూరుహం బచటఁ గాంచి
యయ్యగ్ని యీతరువయ్యెఁగా కేమని తలపోసి తాపసోత్తములతోడ
వేదమాతృకయైన విమలమంత్రం బనుష్ఠించుచుఁ దత్తరుచ్ఛేదనంబు


తే.

రమణఁ జేసి తన్మంత్రాక్షరముల సంఖ్య, నమరునంగుళములనిడుపైన యరణి
నెమ్మి నొనరించి యం దనలమ్ము వడసి, యజ్ఞ మొనరించె లోకంబు లభినుతింప.

112


వ.

ఇట్లు కృతకృత్యుండై యప్పుణ్యకర్మంబువలన నూర్వశీసాలోక్యంబు మొదలుగా
సమస్తంబునుం బడసి గంధర్వాదినానాలోకంబుల విహరించుచు రాజసూయా
శ్వమేధాదియజ్ఞంబులు యథాయోగ్యంబులుగా ననుపించుచు రాజ్యంబు
సేయుచుండి.[3]

113


తే.

ఆదిమనుకాలమం దేకమైన క్రతుమ, హాగ్ని వైవస్వతాగ్నిమన్వంతరమున

  1. నమ్రమస్తకుండు = మిక్కిలి వంపఁబడినమొగము గలవాఁడు, సాలోక్యంబు = సమానలోకత్వము.
  2. ఆమ్నాయ = వేదములను, త్రిత్వము = మూడుగా నగుట, జగత్పూరంబుగాన్ = లోకపావనముగా.
  3. యథాయోగ్యంబులుగా = తగినట్టు, అనుష్ఠించుచున్ = నడపుచు.