పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సోమునిపుత్రుఁడో గురునిసూనుఁడో నా కెఱిఁగింపుమన్న నీ
సోమసుతుండు గాని గురుసూనుఁడు గాఁడని పల్కె నేర్పడన్.

61


వ.

ఇవ్విధంబునం బలికినయప్పలుకులు విని బృహస్పతి కుమారునియందు మోహం
బు విడిచి పత్నీసమేతుండై యరిగె మహాదేవపితామహప్రముఖు లైనదేవర్షి
గణంబులు నిజనివాసంబులకుం బోయిరి. చంద్రుండును నక్కుమారు నాలింగ
నాదివిశేషంబుల గారవించి బుధుం డనునామధేయంబు చేసి నిజభార్య యైన
రోహిణీదేవి కిచ్చిన.

62


తే.

రోహిణీదేవి యక్కుమారునకుఁ గన్న, తల్లికంటెను మిగులఁ దాత్పర్యవృత్తి
నడపి పెంచుచు నుపలాలనంబు చేసెఁ, జంద్రుఁ డెంతయు నాత్మలో సంతసిల్ల.

63


ఆ.

బుధుఁడు తపము చేసి యధికతేజోనిధి, యగుచు గ్రహపథంబునందు నిలిచి
నతఁడు మనుతనూజయగు నిళయందుఁ బు, రూరవుండు నాఁగుమారుఁ గనియె.

64

పురూరవుండు ఊర్వశీరక్తుండై విహరించుట

సీ.

భూభరణక్రియాస్ఫురణఁ గుంభీనసక్రోడేభములనైనఁ గొంచెపఱచు
దానవైఖరిఁ గామధేనుకల్పద్రుమచింతామణులనైన సిగ్గుపఱచు
సౌందర్యమున సురేశ్వరతనూభవసోమపంచబాణులనైన భంగపఱచు
విమలధైర్యంబున హిమమహీధరమేరుమందరాదులనైనఁ గ్రిందుపఱచు


తే.

దీవు లేడింటఁ దనయాజ్ఞ దేజరిల్ల, నిజచరిత్రంబు భావిభూభుజుల కెల్ల
మేలుబంతిగా వసుంధర యేలుచుండె, భూరివిక్రముఁ డైనపురూరవుండు.[1]

65


వ.

అట్టి పురూరవుండు నిజరాజధాని యైనప్రతిష్టానపురంబున రాజ్యంబు సేయు
చుండి యొక్కనాఁడు.

66


సీ.

మందారచందనమాకందశాకోటజంబీరనీపకదంబతరులు
మల్లికామాధవీమాలతీచంపకకుందాదిసంఫుల్లకుసుమలతలు
కలనాదకలహంసికాచక్రవాకవిస్తారకాసారకాసారములును
గీరపారావతళాశారికామృడభంగపరపుష్టపరితుష్టపరిచితంబు


తే.

మందమలయానిలోద్ధూతమానసుమప, రాగధూసరితాకాశభాగతలము
గలిగి వనదేవతాసముత్కరమనోభి, రామమై యొప్పుచున్న యారామములను.[2]

67


వ.

ఇట్టివినోదంబులం దగిలి వినోదించుచున్న సమయంబున.

68


సీ.

తనకొప్పులోని కమ్మనిపూవుతావులసొబగు దిక్కులనెల్ల పోడుముట్టఁ
దననీడువాలునేత్ర ముల యల్లార్పుచూపులు పాంథజనుల గుండెలు పగుల్పఁ

  1. కుంభీనసక్రోడేభములన్ = ఆదిశేషుని ఆదివరాహమును అష్టదిగ్గజములను, సురేశరతనూభవసోమపంచబాణులన్ = జయంతుని చంద్రుని మన్మథుని.
  2. శాకోట = వెల్లతేఁకుచెట్టు, నీప = కడపచెట్టు.