పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్వరచతురంగసైన్యములఁ జంద్రునకుం బటుసంగరక్రియా
పరిణతి దోడుసూపుటకుఁ బంపె సహాయము గాఁగ నుద్ధతిన్.[1]

51


మ.

జయకాంతాపరిరంభకౌతుకములన్ శర్వామృతాంశుల్ జగ
ద్భయదాకారవిహారసంగరకళాపాండిత్యముల్ సూపుచు
న్నయెడన్ బంకజసంభవుం డమరగంధర్వాప్సరోయుక్తుఁ డై
రయ మేపారఁగ వచ్చి యాఘనులసంగ్రామంబు వారించుచున్.[2]

52


క.

హిమకరుని దోడుకొని చని, క్రమమొప్పఁగ బుద్ధి చెప్పి కామాతురభా
వము మాన్పి తారఁ గొని చని, యమరాచార్యునకు నిచ్చె నభవుఁడు మెచ్చన్.

53


వ.

అప్పుడు వాచస్పతి యాసన్నప్రసవగర్భవతి యైన తనభార్యం జూచి మదీయక్షే
త్రంబున నన్యవీర్యం బుదయించు నిక్కుమారుని విసర్జించి రమ్మనినఁ బతివచ
నం బలంఘనీయం బగుటం జేసి యప్పరమపతివ్రత యీషికాస్తంబమధ్యంబున
నక్కుమారునిం గనిన.[3]

54


తే.

దివ్యతేజోవిలాససందీప్తుఁ డగుచు, మోహనాకారమున నున్నముద్దుకొడుకుఁ
జూడ ననిమిషగురునకు సోమునకును, బుత్రమోహంబు లగ్గలంబుగఁ జనర్చె.[4]

55


తే.

వీఁడు నాసుతుండు వీఁడు నా ముద్దుల, కొడుకుఁ గుఱ్ఱ యనుచుగురుఁడు విధుఁడుఁ
బూని యొకరికొకరు పుత్రమోహంబున, జగడమాడుచున్న సమయమునను.

56


క.

దేవతలు మునులు తారా, దేవిన్ వీక్షించి వీఁడు దేవగురుసుతుం
డో వనజారిసుతుండో, నీవింతయుఁ దెలియఁజెప్పు నిక్కం బనినన్.

57


క.

నలువురు నాలుగుదిక్కులఁ, దల లెత్తుక చూడ మగఁడు దలవంపఁగ నీ
చులుకఁదన మింక నేమని, పలుకుదు నని చెప్పి సిగ్గుపడియుండుటయున్.

58


వ.

అప్పు డప్పితామహుం డప్పువ్వుఁబోణిం బుజ్జగించి యిట్లనియె.

59


క.

సి గ్గేల నీకు నీపని, యెగ్గని పాటించి యాడ రెవ్వరు నీకున్
లగ్గగు నీమగఁడును మది, నెగ్గింపం డెవ్వ రిట్లు చేయరు తన్వీ.[5]

60


ఉ.

సోమునిఁ జూచియున్ గురుని జూచియుఁ బక్షపుమాట మాను తే
జోమహనీయమూర్తి యగుచుం జెలువొందెడు నీకుమారుఁ డీ

  1. పటుసంగరక్రియాపరిణతిన్ = సమర్థమైన యుద్ధవ్యాపారముయొక్క పరిపూర్తిచేత.
  2. పరిరంభ = ఆలింగనమువలని, శర్వామృతాంశులు = శివుఁడును చంద్రుఁడును, సంగరకళా = యుద్ధ మనెడి విద్యయందలి, ఏపారన్ = అతిశయింప.
  3. ఆసన్న = సమీపించిన, అలంఘనీయము = దాఁటఁదగనిది, ఈషికాస్తంబమధ్యంబునన్ = కసపుగంటనడుమ.
  4. అగ్గలంబుగన్ = అధికముగా.
  5. ఎగ్గు = కీడు - దోషము, లగ్గు = మేలు - శుభము, నెగ్గింపడు = రోఁతపడఁడు.