పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మత్తేభగమన మిగులం, దత్తరపడి సమ్మదమునఁ దమకించుటయున్.[1]

24


క.

పరకాంత బ్రాహ్మణస్త్రీ, గురునాథునిభార్య దీనిఁ గూడిన మిగులన్
దురితంబు వచ్చునని మదిఁ, బరికింపక విధుఁడు తారఁ బైకొని కలసెన్.[2]

25


వ.

ఇవ్విధంబున నయ్యిరువురు నన్యోన్యసరససంభోగంబులవలనం జొక్కి వర్తించు
చుండి రంత.

26


ఉ.

చిక్కులుపడ్డవెండ్రుకలు చిక్కినలంగినకమ్మపూవులుం
జక్కెరమోవులుం గుసుమసాయకుముద్రలు చిట్లుగందపుం
బక్కులతోడిదేహములు పాయనిమోహములున్ సమంబులై
చొక్కపుజారదంపతులు చూడఁ బ్రకాశత నొంది రెంతయున్.[3]

27


వ.

అంత నొక్కనాఁడు రోహిణీకాంతుండు గురుకాంత కిట్లనియె.

28


క.

మగువా మనచేఁతలు నీ, మగనికి వినఁబడినఁ గడుబ్రమాదము వచ్చున్
జగముల మిగులఁ బ్రకాశం, బగుచున్నది యిచట నుండ నగునే మనకున్.[4]

29


వ.

అనిన నతని నవలోకించి.

30


క.

ఎక్కడిమగఁ డెక్కడిబ్రతు, కెక్కడిసంసారచింత లేటికి నాకుం
దక్కక నీబిగికౌఁగిట, నొక్కటియై రతుల సలుపకుండినఁ జంద్రా.

31


క.

నీవెంటఁ దోడునీడై, నే వచ్చెదఁ దొడుకపొమ్మ నీకును నాకున్
దైవంబు లంకెసేసెను, జైవాతృక పంచశరుఁడు సాక్షిగ మనకున్.[5]

32


వ.

అని యిట్లు మరులేచి పలికిన నాకమలవైరియుఁ గమలలోచనం దోడ్కొని
నిజనివాసంబునకుం బోయి నిరుపాధికంబులును నిరాతంకంబులునైన యభిమత
భోగంబు లనుభవించుచుండె నంత.[6]

33


చ.

అమరగురుండు దేవపతియాగము సాంగముగా నొనర్చి సం
భ్రమమున నెల్లవారు బహుమానము సేయఁగ వేడ్కతో నిజా
శ్రమమున కేగుదెంచి వ్యభిచారితనంబునఁ జంద్రువెంట మా
రుమనువు తార వోవుటయు రోసి నిరంతరదుఃఖితాత్ముఁడై.

34


చ.

సురగురుఁ డాలిఁ గోలుపడి సోముఁడు సేసిన ధౌర్త్యమంతయున్
సురపతితోడఁ జెప్పిన వృషుం డతిభీషణకోపవేష్టితా

  1. తలిరాకులవిత్తై = చిగురుటాకులపరంపర గలదై - చిగుళ్లను కత్తులచేతిబాధచే చలించినదై యనుట, తమకించుటయున్ = వేగిరపడఁగా.
  2. పరికింపక = విచారింపక, విధుఁడు = చంద్రుడు, పైకొని = పైఁబడి.
  3. కమ్మ = పరిమళముగల, చక్కెరమోవులు = చక్కెరవలె మాధుర్యము గలయధరములును, ముద్రలు = చిహ్నములు, పక్కులతోడి = పెల్లలతోఁ గూడిన.
  4. చేఁతలు = చేష్టలు, ప్రకాశంబు = ప్రసిద్ధము.
  5. తొడుకపొమ్ము = తోడుకొనిపొమ్ము, జైవాతృక = చంద్రుఁడా.
  6. మరులేచి = మోహ మతిశయించి, నిరుపాధికంబులు = చింతలేనివి, నిరాతంకంబులు = భయము లేనివి, సాంగముగాన్ = తుదముట్ట.