పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గరిమతో నాలేమ సరససల్లాపంబు లాలించి యేకాంతమాడఁగోరుఁ
దమకంబుతోడ నత్తరుణీశిరోమణీయధరసుధారసం బానఁ దివురు


ఆ.

నింతి యవయవముల నెసఁగు సౌందర్యంబుఁ, గన్నులారఁ జూచు కాంక్షతోడ
మదనబాణభిన్నహృదయయై యాతని, తలఁపుఁ దెలిసి తగులు దలఁపు చేసి.[1]

18


సీ.

ఎలనాఁగ దా వచ్చి యప్పటప్పటికి సమేలంపుమాటల మేలమాడుఁ
బలుమాఱుఁ దనమ్రోల కలికిసేఁతల కోడి వలకారితనమున వన్నెఁ బెట్టు
నన్యాపదేశంబు లాడి నెచ్చెలులచేఁ బ్రియమార నేమేనిఁ బెట్టిపంపు
నేకాంతమైనచో నెవ్వరు వినకుండ నూరకవచ్చి నర్మోక్తులాడు


తే.

గబ్బిగుబ్బచన్నుఁగవమీఁదిపయ్యెద, జాఱద్రోచు తీఁగె సాగనవ్వు
విరులుఁ జందనంబు వీడెంబు నూరక, యడుగ నంపు జారయై మృగాక్షి.[2]

19


వ.

ఇవ్విధంబున నన్యోన్యసరససల్లాపంబులవలనం బరస్పరస్నేహకుతూహలంబు లంత
కంతకుం బెరిగివచ్చుచున్న నొక్కనా డేకాంతంబున.

20


ఉ.

మేలము లాడుచుం దనసమీపమునన్ విహరించుచున్న య
బ్బాలికగుబ్బచన్నుఁగవపై యరజాఱినయుత్తరీయపుం
జేలము పట్టి రాఁదిగిచి చెక్కులు నొక్కుచు బుజ్జగించి హే
రాళము లైనమోహపువిరాళితనంబుల నాతఁ డిట్లనున్.[3]

21


క.

తరళాక్షి నీతిశాస్త్రము, లిరవుగ గురువలనఁ బెక్కు లెఱిఁగితి నింకన్
గురుపత్ని వైననీచే, వరుసన్ మరుశాస్త్ర మెఱుఁగవలయు నాకున్.[4]

22


చ.

అనవుడు లేఁతనవ్వు వదనాంబురుహంబునఁ జెంగలింప న
వ్వనరుహనేత్ర కన్నుఁగవ వాలికఱెప్పల గప్పి పెద్దయుం
బెనఁగొన మన్మథుండు పిరువీఁకులు సేయఁగఁ దత్తరించుచుం
దనువునఁ గ్రొత్తముత్పులకదంతురపఙ్క్తులు నివ్వటిల్లఁగన్.[5]

23


క.

చిత్తజుచేఁ దలిరాకుల, విత్తై తనధైర్యమెల్ల వెడల నడిచి యా

  1. తిలకించున్ = చూచును, కిలికించితాదులన్ = కిలికించితము మొదలుగాఁగల శృంగారచేష్టలను [కిలికించితము = సంతోషరోషాశ్రుభయాదుల కలయిక], గెల్లుచూచున్ = నిక్కి చూచును, నిగ్గులుదేఱు = నిగనిగలాడు, ఏకాంతము = రహస్యము, ఆనన్ = త్రాగ, తివురున్ = యత్నించును, భిన్న = భేదింపఁబడిన, తగులు = పొందునట్టి.
  2. సమేలంపు = కలగలుపుగల, మేలమాడున్ = సరసములాడును, కలికినేఁతలకున్ = విలాసచేష్టలకు, వలకారితనమునన్ = మోహముగల స్వభావముతో, వన్నెబెట్టున్ = అలంకరించుకొనును. అన్యాపదేశంబులు = వేఱొకదాని జూపి తనయభిప్రాయమును దెలుపునట్టిమాటలు, నర్మోక్తులు = శృంగారహాస్యాస్పదములైన ప్రియవాక్యములు, తీఁగసాగన్ = దీర్ఘధ్వని కలుగునట్టుగా.
  3. మేలములు = పరిహాసపుమాటలు, చేలము = వస్త్రము, విరాళితనంబులన్ = ఆసక్తతలతో.
  4. ఇరవుగన్ = విశదముగా.
  5. చెంగలింపన్ = వ్యాపింపఁగా, వాలిక = వాలుగల, పిఱువీఁకులు = పీఁకుపీఁకుళ్లు, ముత్పులకదంతురపఙ్క్తులు = సంతోషమువలనఁ గలిగినగగుర్పాటుయొక్క యెక్కుడైన చాళ్లు, నివ్వటిల్లఁగన్ = అతిశయింపఁగా.