పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పంచచామరము.

కరూశకాశలాటభోటగౌళచోళహూణబ
ర్బరాంగవంగశూరసేనపాండ్యసింధుమండలే
శ్వరోపగీయమానభూరిసత్కథాభివైభవా
ధరాధరాధరోపమానధైర్యశౌర్యశోభితా.[1]

363


గద్యము.

ఇది శ్రీమదమరనామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సుకవిజనవిధేయ వె
న్నెలగంటి సూరయనామధేయ ప్రణీతం బైనయాదిమహాపురాణంబగు బ్రహ్మాం
డంబునందలి పరాశరసంహితయైన శ్రీవిష్ణుపురాణంబునందు సూర్యవంశంబున
మనుకీర్తనంబును శశాదుకథయును దుందుమారుచరితంబును మాంధాతృ
జన్మంబును సౌభరిపరమగృహస్థధర్మంబున నుండుటయు పురుకుత్సుండు జన్మించు
టయు సగరుచరితంబును కల్మాషపాదునివర్తనంబును దాశరథివంశపరంపరాప్ర
భావంబును నిమిచక్రవర్తియజ్ఞప్రశంసయు జనకవంశానుక్రమంబును నన్నది
పంచమాశ్వాసము.

———

  1. మండలేశ్వర = రాజులచేత, ఉపగీయమాన = కొనియాడఁబడుచున్న, భూరి = అధికమైన, సత్కథాభివైభవా = మంచికథల కలిమిగలవాఁడా, ధరా...శోభితా = భూమివలె చలించనిధీరత్వముచేతను పర్వతమువలె ఉన్నతి గలశూరత్వముచేతను ప్రకాశించువాఁడా.