పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విద్య నేర్చి మహాత్ముఁడై వెలసె నవని, నతఁడు సుతుఁ గాంచెఁ బుణ్యు నున్నతగుణాఢ్యు.

332


వ.

తదీయవంశపరంపరలై ధ్రువుండును ధ్రువునకు సుధన్వుండును సుధన్వునకు
నగ్నివర్ణుండును వానికి శీఘ్రుండును శీఘ్రునకు మరుండు ననురాజులు క్రమం
బునం బుట్టి రెందు నమ్మరుండు.

333


క.

విను మాగామియుగంబున, నినవంశము నిలుపఁగా నహీనపుయోగం
బున నేఁడు నున్నవాఁ డ, త్యనఘుండు కలాపమను మహాగ్రామమునన్.[1]

334


వ.

అట్టి మరువంశపరంపరలు విను మమ్మరునకుఁ బ్రత్యాకుండును వానికి సుగం
ధియు సుగంధికి సమర్షణుండును వానికి సహస్వంతుండును వానికి విశ్వభవుం
డును విశ్వభవునకు బృహద్బలుండునుం బుట్టి రాబృహద్బలుం డర్జునపుత్రుం
డైనయభిమన్యునిచేత భారతయుద్ధంబునం బరలోకగతుం డయ్యె నని యిక్ష్వాకు
పుత్రుం డైనశశాదునివంశంబునఁ బ్రసిద్దులైన రాజులచరిత్రంబులు సెప్పి పరా
శరుండు వెండియు నిట్లనియె.

335

నిమిచక్రవర్తి వసిష్ఠశాపంబున విదేహుండై లోకులనేత్రముల నుండునట్లు దేవతలవలన వరంబు పడయుట

మ.

లలి నిక్ష్వాకుతనూజుఁ డైననిమి లీలన్ వేయిసంవత్సరం
బులు సత్రం బొనరింపఁబూని కరుణామూర్తిన్ వసిష్ఠు దపో
బలసంపన్నుని హోతఁగాఁగ నతనిన్ బ్రార్థించినన్ ధారుణీ
తలనాథోత్తముతోడ నమ్ముని సముద్యత్ప్రీతితో నిట్లనున్.[2]

336


క.

భూనాయక పురుహూతుం, డేనూఱేఁడులు మఘంబు హితమతిఁ జేయం
బూని మును నన్ను హోతం, గా నియమించెను నపారగౌరవ మొప్పన్.

337


తే.

అతనియజ్ఞంబు గావించి యది సమాప్త, మైన మఱి నీమహాక్రతు వాచరింతు
ననిన నేమియుఁ బలుకక యానరేంద్రుఁ, డుండె నది సమ్మతంబని యొనరఁ దలఁచి.

338


క.

మునివరుఁడు వజ్రియాగం, బొనరింపఁగఁ జని సమాప్తి నొందించి ముదం
బున నిమియజ్ఞము సేయం, జనుదెంచె నతిప్రయత్నసంభ్రమ మెసఁగన్.[3]

339


వ.

ఇట నిమిచక్రవర్తియు యజ్ఞోపకరణంబు లైనపదార్థంబు లనేకంబులు సంపాదిం
చినవాఁ డగుటం జేసి వసిష్ఠాగమనంబు మనంబునఁ దూష్ణీంకృతంబు చేసి గౌతముఁఁ
బురోహితుంగా వరియించి యజ్ఞంబు సేయుచున్న సమయంబున వసిష్ఠుండు గర్మ

  1. ఆగామి = రాఁగల.
  2. సత్రము = యాగము, హోత గాఁగన్ = ఋగ్వేదవేత్తయైన మహర్షి.
  3. వజ్రి = ఇంద్రుఁడు.