పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యజ్ఞంబు సేసె నయ్యజ్ఞసమాప్తదివసంబున నమ్మునీంద్రుం డనుష్ఠానార్థంబుగాఁ
జనినసమయంబు వేచి.[1]

278


క.

మును పగచాటుచుఁ బోయిన, దనుజుండు వసిష్ఠురూపుఁ దాల్చి ధరిత్రీ
శునికడకుఁ జని రహస్యం, బున నరమాంసంబుతోడి భోజన మడిగెన్.

279


చ.

జనపతి యట్లకాక యని సమ్మతిచేసెను సూపకారుఁ డై
దనుజుఁడు వచ్చి యవ్విభుమతంబున మానవమాంస మిమ్ముగాఁ
గొని చని వండి బంగరపుఁగోరను గోరిక మీఱఁ బెట్టి య
మ్మునిపతి కిమ్మటంచు నృపుముందఱఁ బెట్టి యదృశ్యమై చనెన్.[2]

280


ఆ.

అంత నవ్వసిష్ఠుఁ డరుదెంచి భోజన, మర్థిఁ జేయునప్పు డవ్విభుండు
మునికిఁ గడురహస్యమున నరమాంసంబుఁ, దెచ్చి పెట్టె మీఁదు దెలియలేక.

281


క.

మౌనీశ్వరుండు దానిన్, మానవమాంసంబుగా సమంజసదివ్య
జ్ఞానమునఁ దెలిసి యానృప, సూనునెడం దప్పులేమిఁ జూడక కినుకన్.

282


ఉ.

శ్రీకరమైనపుణ్యములఁ జెందఁగ ఘోరతపంబు సేయఁగా
మాకు నభోజ్య మైననరమాంసము బెట్టుట యాసురంబు నీ
వీకపటంబుఁ జేసితివి యింతటనుండియు రాక్షసత్వముం
జేకొని యిట్టిభోజనము సేయు మటంచు శపించె నుగ్రుడై.[3]

283


వ.

ఇట్లు శపించినవసిష్ఠునకు నరేంద్రుం డిట్లనియె.

284


తే.

నీవ కావె మునీశ్వర నేటిరేపు, మనుజమాంసంబుతోడి భోజనము నన్ను
నడిగినాఁడవు నీ విప్పు డది తలంప, కేల శపియించితివి కృప యింతలేక.[4]

285


వ.

అనిన నమ్మునీంద్రుండు క్రమ్మఱం దనయోగసమాధిం జూచి రాజువలన నపరా
ధంబు లేకుండు టెఱింగి పండ్రెండువత్సరంబులకు శాపమోక్షణం బగునని
యనుగ్రహించిన శాపానుగ్రహంబులు గైకొని నరేంద్రుండు మునీంద్రున
కిట్లనియె.

286


ఆ.

నిరపరాధి నన్ను నిష్కారణము శపి, యించినాఁడ వింక నీవు సూర్య
కులము భూపతులకు గురువవుగాఁగ న, ర్హుఁడవు గాక నవయుచుందుగాక.[5]

287


క.

అని ప్రతిశాపజలంబులు, గొనఁగా నపు డెఱిఁగి యతనికులసతి మదయం
తి నరేశ్వర యోహోహో, చనునే గురువునకు నలిగి శాపం బీయన్.

288


వ.

అని నివారించిన నతండు మనసు విఱిగి యాశాపజలంబులు భూనభంబులం జల్లిన
లోకంబులకు నుపద్రవం బగునని తనపాదంబులయంద చల్లుకొనిన నాత్మీయకో
పానలాశ్రితంబు లైనయాజలంబులచేతం దనపాదంబులు దగ్ధచ్ఛాయ యైన

  1. వేచి = కనిపెట్టి.
  2. ఇమ్ముగా = బాగుగా, బంగరవుఁగోరన్ = బంగారుగిన్నెయందు.
  3. అసురంబు = అసురకృత్వము.
  4. నేటిరేపు = ఈదినము ప్రాతఃకాలమున.
  5. నిరపరాధిన్ = తప్పులేనివానిని, నవయుచుందు = అలయుచుందువు.