పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గానదిలోపలన్ మునుఁగఁ గల్గిన శాశ్వతనాకసౌఖ్యముల్
మానక గల్గుటే యరిది మర్యులయంగములందు నొక్కటే
దేనియు నజ్జలంబు లొకయించుక సోఁకినఁ గల్గు స్వర్గమున్.[1]

268


క.

అని యిట్లు పలికి యానృప, తనయునిఁ బొమ్మనిన నతఁడు తాపసికి ముదం
బున మ్రొక్కి యధ్వరాశ్వముఁ, గొనివచ్చి పితామహునకుఁ గొమ్మని యిచ్చెన్.

269


ఆ.

సగరచక్రవర్తి శాస్త్రమార్గంబున, నశ్వమేధయజ్ఞ మాచరించె
జలధి నాటనుండి సాగరుం డనుపేర, వినుతికెక్కి సగరతనయుఁ డయ్యె.

270


వ.

సగరుపరోక్షంబున నంశుమంతుండు రాజ్యాభిషిక్తుఁ డయ్యె నతనికి దిలీపుండు
పుట్టె నతనికి భగీరథుండు జన్మించి.[2]

271


క.

ఘన మైనతపము పెంపున, ననిమిషనది నిలకుఁ దెచ్చి యఖిలము నెఱుఁగం
దనపేరను భాగీరథి, యనునామముఁ గలుగఁ జేసె నతఁ డానదికిన్.[3]

272


వ.

అట్టి భగీరథునకు సుహోత్రుండును సుహోత్రునకు నాభాగుండును నాభాగు
నకు నంబరీషుండును నంబరీషునకు సింధుద్వీపుండును సింధుద్వీపునకు నయుతా
యువును నయుతాయువునకు ఋతుపర్ణుండునుఁ బుట్టి రట్టిఋతుపర్ణుం డుపవిద్యా
ప్రవీణుండై జూదంబున రాజ్యంబుఁ గోలుపోయిననలచక్రవర్తికి సాహాయ్యంబు
చేసి తపోమహత్త్వంబున రాజఋషి యయ్యె నట్టిఋతుపర్ణునకు సర్వకాముం
డును సర్వకామునకు సుదాసుండును సుదాసునకు మిత్రసఖుండునుం బుట్టి రట్టి
మిత్రసఖుండు రాజ్యంబు సేయుచుండి యొక్కనాఁడు.

273


క.

కానకు వేటాడఁగ నా, భూనాథుఁడు వోయి రెండుపులుల మహోగ్ర
ద్వాన మొనరించుచుండెడు, వానిం బొడగాంచి చేరవచ్చి మనములోన్.

274


క.

ఈకోలుపులులకతమున, నీకాననమున మృగంబు లెవ్వియు లేవం
చాకరశరమున నందొక, భీకర మగుమృగముఁ బడఁగఁ బెలుచన నేయన్.[4]

275


క.

దనుజాకృతి నాబెబ్బులి, తనువు విడిచె నున్నయదియు ధరణీపతి దా
విన దీనికిఁ బ్రతికారం, బొనరించెద నీవు మఱవకుండు మటంచున్.[5]

276


క.

పగచాటుచు దనుజుండై, యెగసి చనియె నపుడు విస్మయీభూతాత్ముం
డగుచుఁ దనరాజధానికి, మగుడం జనుదెంచి నృపకుమారుం డుండెన్.[6]

277

సౌదాసుండు వసిష్ఠుశాపంబున నరమాంసభక్షకుం డగుట

వ.

అంత నాసౌదాసుండు నిజకులాచార్యుం డైనవసిష్ఠుండు పురోహితుండుగా

  1. జగత్పరిపూత = లోకమును పరిశుద్ధమునుగాఁ జేయునది, అరిధి = దుర్లభము.
  2. పరోక్షంబునన్ = అనంతరము.
  3. పెంపునన్ = అతిశయముచేత.
  4. కోలుపులులు = పెద్దపులులు, పెలుచనన్ = దురుసుతనముతో.
  5. బెబ్బులి = పెద్దపులి, ఉన్నయదియు = మరియుకపెద్దపులియును.
  6. పగ చాటుచున్ = విరోధమును ప్రసిద్ధపఱచుచు, విస్మయీభూతాత్ముండు. = ఆశ్చర్యము నొందిన మనసుగలవాఁడు.