పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

ఐహికంబు లైనమోహలతానేక, బంధనంబు లెల్లఁ బరమయోగ
విమలతత్త్వ మనులవిత్రమునను గోసి, వైచి నిష్కళాత్మవర్తి యగుచు.[1]

189


క.

దుస్సహ మిహసౌఖ్యంబౌ, దుస్సంగతి పుత్రమిత్రదుహితృతతి యిసీ!
నిస్సారము సంసారము, లెస్స యనుచు మనుజు లేల లెక్కింతురొకో.[2]

190


క.

పదివేలవిధంబుల నే, వదలక విషయోపభోగవాంఛలవలనం
బొదలియు నాచిత్తము తని, యదు మిక్కిలి నాడు నాటి కధికం బగుచున్.

191


సీ.

అంతర్జాలంబులయందుఁ దపోవృత్తిఁ జరియించు నాకు మత్స్యప్రసంగ
వశమునఁ జేసి వివాహంబునకు నేకకన్యార్థినై పోవఁగా ననేక
భార్యాజనంబులఁ బరిణయం బొనరింపఁ బాటిల్లె మఱి కుటుంబములఁ బ్రోవ
బాహుళ్య మైనసంపదలు సంపాదింపవలసెఁ దదాసక్తివలనఁ జేసి


తే.

పుత్రపౌత్రదౌహిత్రకళత్రమిత్ర, బంధుధనధాన్యవైభవప్రాభవములు
చూచి పెక్కేండ్లు సంసారసుఖములందు, గాసిపడితి వృథాపోయెఁ గాలమెల్ల.[3]

192


క.

యోగము గల్గినచోటను, భోగంబులు లేవు భోగములు గల్గినచో
యోగంబు లేదు గావున, యోగము భోగంబుఁ బడయ నొరులకు వశమే.

193


మ.

అని సర్వంబుఁ బరిత్యజించి నిజభార్యాయుక్తుఁడై కానకున్
జని పెక్కేండ్లు తపంబు చేసి పిదపన్ సన్యాసియై వార్ధకం
బున సాంగత్యవశంబు లైనవిషయంబుల్ మాని యంత్యంబునన్
గనియెజ్ సౌభరి విష్ణుభక్తివలనఁ గల్యాణకైవల్యమున్.[4]

194


క.

ఈసౌభరికథ దలఁచిన, వ్రాసినఁ బేర్కొనిన వినిన వర్ణించిన న
భ్యాసము చేసినవారికి, శ్రీసంపద లొనరి మోక్షసిద్ధియుఁ గలుగున్.

195


వ.

అని చెప్పి పరాశరుండు మాంధాతృపుత్రసంతతి వినుమని యిట్లనియె.

196


తే.

తాపసోత్తమ మాంధాతతనయుఁ డైన, యంబరీషున కుదయించె ననఘచరితుఁ
డైనయువనాశ్వుఁ డతనికి హరితుఁ డనఁగఁ, బుత్రుఁ డుదయించె నమ్మహీభుజునియందు.

197


తే.

అంగిరసు లనుగంధర్వు లాఱుకోట్లు, పుట్టి పాతాళమునఁ జొచ్చి భుజగపతుల
కెల్ల నుపహతి చేసి యనేకదివ్య, రత్నములతోడఁ గామినీరత్నములను.[5]

198


క.

బలిమిం గైకొనిన రసా, తలలోకము వెడలి భుజగతతు లెల్ల భయా
కులితాత్ము లగుచుఁ జని యా, జలనిధిపై యోగనిద్ర సలిపెడువానిన్.

199


శా.

కాలాత్మున్ భువనైకసేవితు జగత్కల్యాణమూర్తిన్ దయా
శీలున్ బన్నగతల్పు సన్నిహితరాజీవాసనున్ సర్వలో

  1. లవిత్రము = కొడవలి.
  2. దుస్సహము = సహింపరానిది, సంగతి = సంసర్గము, ఇసీ = సీ.
  3. కుటుంబములన్ = పోష్యవర్గములను, ప్రాభవము = ప్రభుత్వము.
  4. కల్యాణకైవల్యమున్ = శుభకరమైన పరమపదమును.
  5. ఉపహతి = బాధ.