పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్రీతలపతి మాఱాడక, యీతనిఁ బుత్తెంచె మీర లిందఱుఁ జూడన్.[1]

148


క.

మీలోన నెవ్వ రీతని, లీలం గామింతు రటువలెన్ భూవిభుఁ డ
బ్బాలామణి నిమౌనికి, నాలింగాఁ బెండ్లి సేయు నని పలుకుటయున్.

149


క.

భావజుమోహనశరముల, కైవడి గుమికూడియున్న కాంతలు ధరణీ
దేవోత్తము సౌందర్య, శ్రీవిభవముఁ జూచి మెచ్చి చిత్తము లలరన్.[2]

150


ఉ.

ఈతఁడు నాకుఁ బ్రాణవిభుఁ డీతనికిం బ్రియురాల నన్ను ము
న్నీతఁడు సూచె నీతనికి నిల్లడమానిసి నేను నాకుఁగా
నీతఁడు వచ్చెఁ దండ్రి నను నీతని కిచ్చె నటంచు నొక్కమై
నాతరుణీమణుల్ జగడమాడిరి మారవికారచిత్తలై.[3]

151


క.

ఇత్తెఱఁగున నయ్యింతులు, చిత్తజజాణములచేత సిగ్గంతయుఁ బో
నొత్తి మునిఁ బెండ్లియాడఁగఁ, దత్తఱపడు టెఱిఁగి వర్షధరుఁ డాలోనన్.[4]

152


ఆ.

అధిపుసమ్ముఖమున కరుదెంచి వారల, విధముఁ దేటపడఁగ విన్నవించె
మునితపోమహత్త్వమునకు నమ్మాంధాత, విస్మయమునఁ బొంది వేడ్కతోడ.

153


క.

తనకన్యల నేఁబండ్రను, మునిసౌభరి కొక్కలగ్నమునను వివాహం
బొనరించి తగుతెఱంగునఁ, గనకాంబరభూషణములు గారవమొప్పన్.

154


వ.

ఇచ్చి మణికనకశిబికారూఢులం జేసి పంపిన సౌభరియును బంచాశన్నవోఢాసమే
తుండై నిజాశ్రమంబునకు వచ్చి యనేకశిల్పకల్పనాచార్యుం డైనవిశ్వకర్మ
నాకర్షించి యతనితో నిట్లనియె.[5]

155


ఉ.

ఏను గృహస్థధర్మము వహించితి నాదు భార్యలం
మానవనాథకన్యకలు మానితభోగము లందియున్నవా
రీనలినాయతాక్షులకు నిందఱకున్ విహరింప దివ్యరత్నా
నుపమేయకాంచనగృహంబులు పెక్కొనరింపు నేర్పుతోన్.[6]

156


వ.

అనిన నతం డాక్షణంబ బహువిధద్వారోపద్వారకవాటవప్రప్రాకారపరిభావిశా
లంబు లయినకనకరత్నధగద్ధగాయమానప్రాసాదంబులును నానావిచిత్రభిత్తికాస
భాస్తంభసంభృతదేహళిప్రాంగణసుందరంబు లైనమందిరంబులును ప్రోత్ఫుల్లనీ
లోత్పలపంకజకూజితకలహంసకారండవాదివిహంగమాతిశయంబు లయినజలాశ

  1. పుత్తెంచెను = పంపెను.
  2. భావజుమోహనకరములకైవడిన్ = మన్మథునియొక్క మోహనములను బాణములవలెనే.
  3. ఇల్లడమానిసిన్ = నిక్షేపమువంటిదానను, ఒక్కమైన్ = ఒకవిధముగానే.
  4. పోనొత్తి = పోగొట్టి - విడిచి.
  5. పంచాశన్నవోఢాసమేతుండు = ఏఁబదియాఱుగురుకన్యకలతోడను గూడుకొన్నవాఁడు.
  6. అనుపమేయ = సరిపోలఁదగని.