పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ విష్ణు పురాణము


చ.

అరుదుగ నాదిలక్ష్మిసరియైన మహీసుతతోడఁ బంకజో
దరనిభుఁడై యయోధ్యఁ బ్రమదంబు చెలంగఁగ నుండు కైవడిన్
వరవిభవంబుతోఁ జెదలువాడపురంబున నుండు రాఘవే
శ్వరుఁ డిలువేలుపై యొసఁగు సంతతమున్ గృతినాథుకోరికల్.[1]

5


చ.

మెఱసి శశాంకపోత మనుమెచ్చుల క్రొవ్విరికొప్పుచెంగటన్
దుఱిమి కృపారసామృతము తొంగలిఱెప్పలతోడికన్నులన్
నెఱయఁగ యోగినీజనులు నెమ్మిమెయిన్ భజియింకు నున్నమా
కరిముఖదేవుతల్లి దయఁ గాచుఁ గృతీశ్వరుఁ డైనరాఘవున్.[2]

6


శా.

వేదంబుల్ పరమార్థచోదితములై విఖ్యాతసాంగంబులై
యాదిం బంకజగర్భుచే రచితమైన ట్లంశషట్కంబునం
బాదై యుండ నొనర్చె వైష్ణవపురాణం బట్టిజ్ఞానవి
ద్యాదీక్షాగురునిం బరాశరుని నిత్యప్రీతితోఁ గొల్చెదన్.[3]

7


శా.

ఆరూఢస్థితి నెల్లలోకములఁ బ్రఖ్యాతంబుగా భారత
శ్రీరామాయణముల్ రచించినమనీషిస్తుత్యచారిత్రులన్
సారస్ఫారగభీరచారుకవితాసంపన్నవాచాసుధా
ధారాసారవిహారులన్ గొలుతు వేదవ్యాసవాల్మీకులన్.[4]

8


ఉ.

మున్నిటి కాళిదాసకవిముఖ్యులకుం బ్రణమిల్లి వారిలో
నెన్నికగాఁ బ్రబంధపరమేశ్వరుఁ దిక్కనసోమయాజినిన్

  1. మహీసుతతోన్ = సీతతోడ, పంకజోదరనిభుఁడు = విష్ణువుతో సమానుఁడు. ప్రమదము = సంతోషము, చెలంగఁగన్ = అతిశయించగా, ఇలవేలుపు = పరంపరగా తమపెద్దలు సేవించెడు దేవత - గృహదేవత.
  2. శశాంకపోతము = బాలచంద్రుఁడు, మెచ్చులక్రొవ్విరి = మెచ్చుకోఁదగిన క్రొత్తగా పూచిన పువ్వు, చెంగట = సమీపమునందు దీని ప్రథమైనకవచనము చెంగలి, తుఱిమి = చెరివి, కృపారసము = దయారసము, తొంగలి ఱెప్పలతోడికన్నులన్ = వాలుగలకందెఱతోడి కన్నులయందు, నెఱయఁగన్ = వ్యాపింపఁగా, నెమ్మిమెయిన్ = భక్తితో, భజియింపన్ = సేవింపఁగా, కరిముఖదేవుతల్లి = వినాయకుని తల్లి యగు పార్వతి.
  3. పరమార్థచోదితములు = పరతత్వభావమును బోధించునవి, విఖ్యాతసాంగంబులు = ప్రసిద్ధములైన శిక్షాది అంగములతో కూడినది, పంకజగర్భుచేన్ = బ్రహ్మచేత, అంశషట్కంబునన్ = ఆఱుఅంశములతో, పాదై = నెలకొనినదై, విజ్ఞానవిద్యాదీక్షాగురునిన్ = విశేషజ్ఞానయుక్తమైన విద్యకు దీక్షవహించిన యాచార్యుఁడైనవానిని.
  4. ఆరూఢస్థితిన్ = మిక్కిలి నిలుకడ చెందినయునికిచేత, మనీషిస్తుత్యచారిత్రులన్ = విద్వాంసులచేత స్తోత్రము చేయఁదగిన చరిత్ర గలవారిని, సారస్పారగభీరచారుకవితాసంపన్నవాచాసుధాధారాసారవిహారులన్ = రసవంతములును అర్థస్ఫురణకలవియు గంభీరములును మనోజ్ఞములు నై కవిత్వసంపత్తిగలవాక్కులనెడు అమృతధారావర్షమునందు విహరించునట్టివారిని.