పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఆతనిమహత్త్వంబు వినుము.

49


చ.

మురహరుఁ డైనకేశవుతమోగుణమెల్ల ననంతమూర్తియై
ధరణిభరంబు సర్వమును దాల్చు జగత్ప్రళయంబు సేయు న
ప్పురుషుఁడు చిత్రరూపమునఁ బొంది వెలుంగు నతండు నేఁడు ద్వా
పరమున భూమిభార ముడుపన్ జనియించినవాఁడు రాముఁడై.

50


సీ.

మనుజేశ యతఁ డాదిమధ్యాంతశూన్యుండు నిరపాయచిత్తుండు నిర్వికల్పుఁ
డాదిదేవుఁ డనంతుఁ డవ్యయాత్ముఁడు కళాకాష్టానిమేషాదికాలరూపి
సర్వంకషుఁడు రజస్సత్వతామసగుణోద్రిక్తుండు నుద్భవస్థితివినాశ
కారణభూతుఁ డాకాశతత్వోపసత్సంపన్నుఁ డపహృతజన్మమరణుఁ


తే.

డతులకల్యాణమూర్తి వేదాంతవేద్యుఁ, డతులయోగీంద్రహృదయవిహారశీలుఁ
డప్రమేయుం డవాఙ్మయుఁ డాహితాగ్ని, యదుకులంబున జన్మించి యవని మించె.[1]

51


క.

బలభద్రమూర్తి యగునా, బలభద్రుఁడు నీలవస్త్రపరిధానుఁడు లాం
గలముసలపాణి యాదవ, కులరత్నము నీతనూజకుం దగు ననఘా.[2]

52


ఆ.

విష్ణుదేవుఁ డతఁడు విష్ణుమాయాశక్తి యీలతాంగి వీర లిరువురకును
దగు నరేంద్రచంద్ర దాంపత్యవైభవం, బట్లు సేయు సంశయంబు మాని.

53


వ.

మున్ను నీచేతం బరిపాలింపంబడిన యమరావతికంటె రమ్యం బయినకుశస్థలీపురం
బిప్పుడు యుగాంతరంబుల ద్వారావతి యనంగ యాదవరాజధానియై యున్న
యది యందు యదువృష్ణిభోజాంధకలోకంబు గొలువ వినోదించుచున్న కామ
పాలునకు నీకన్నియ వివాహంబు సేయుపొ మ్మని యామంత్రణము సేసినం
బ్రణమిల్లి వీడ్కొని రేవతీసమేతుండై భూమండలంబునకు వచ్చి.[3]

54


క.

హ్రస్వుల నిస్తేజుల దుఃఖస్వా౦తుల విష్ణుభక్తిగర్హితమతులన్
స్వస్వానురూపసన్మా, ర్గస్వల్పులఁ గాంచె నవనికాంతుఁడు నరులన్.[4]

55


వ.

ఇట్లు కనుంగొనుచుఁ జని ద్వారకాపురంబు సొచ్చి.

56


క.

అతులోదీర్ణస్ఫటిక, క్షితిభృత్సమగాత్రుఁ డైనసీరధరు సము

  1. ఆదిమధ్యాంతశూన్యుండు = జన్మస్థితినాశములు లేనివాఁడు, నిరపాయచిత్తుండు = కీడులేని మనసు గలవాఁడు, నిర్వికల్పుఁడు = పొరపాటు లేనివాడు, అవ్యయాత్ముఁడు = నాశరహితస్వరూపుఁడు, సర్వంకషుఁడు = ఎల్లయెడల నిండియుండువాడు, ఉద్రిక్తుండు = మిక్కిలి అతిశయించినవాఁడు, ఆప్రమేయుఁడు = ఇట్టివాఁడని తెలియరానివాఁడు, అవాఙ్మయుఁడు = వాక్కునకు అందనివాఁడు, అహితాగ్ని = యజ్ఞము చేసినవాఁడు.
  2. బలభద్రమూర్తి = బలముచేత పదిలుఁడైనవాఁడు - అతిబలవంతుఁడు, పరిధానుఁడు = కట్టుబట్టగాఁ గలవాఁడు.
  3. ఆమ౦త్రణము సేసినన్ = సెలవియ్యఁగా.
  4. హ్రస్వులన్ = పొట్టివాండ్రను, నిస్తేజులు = తేజస్సు లేనివారిని, గర్హిత = నిందింపఁబడిన, స్వస్వానురూప = తమతమకుఁ దగిన.