పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఆనలినాయతాక్షి తనయౌవనసంపదలెల్ల రోహిణీ
సూనున కీకయుండినఁ బ్రసూనశిలీముఖుచేత నోర్వఁగా
లేనని యక్కుమారుశుభలీలలు నాతనిరూపవైభవా
నూనవిలాసభాసురతయు బ్రియమారఁగఁ జూచె నర్థితోన్.[1]

15


వ.

ఇ ట్లన్యోన్యసమాగమంబున నయ్యిద్దఱుం బెద్దకాలంబు దాంపత్యసుఖంబుల
ననుభవించుచుండ నమ్మిథునంబునకుఁ బురూరవుండు జన్మించె నంత.

16


ఆ.

అప్పు డమితతేజు లైనమహాముని, వరులు భక్తితోడ వైష్ణవాఖ్య
మైనక్రతువు చేసి యయ్యింతి సుద్యుమ్నుఁ, గా నొనర్చి రధికగౌరవమున.

17


క.

మును సుద్యుమ్నుఁడు సతియై, జనియించుటఁ జేసి రాజ్యసంప్రాప్తము లే
కునికి యెఱింగి వసిష్ఠుఁడు, మనువు నొడంబఱిచి యాకుమారవరునకున్.

18


వ.

సకలభోగాధిష్ఠానం బైన ప్రతిష్టానపురంబునందుఁ బట్టంబు గట్టించిన నతండు
రాజ్యసుఖంబు లనుభవించుచు నుత్కళ గయ వినుతు లనుమువ్వురుకుమా
రులం బడసి మహాధర్మశీలుండై యనేకయజ్ఞంబులు చేసి నిజపదంబునఁ బురూ
రవుఁ బట్టంబు గట్టి తపంబునకుం జనియె.[2]

19


తే.

మనుతనూభవు లైనతొమ్మండునృపుల, యందు వృషదుండు దా గురుహత్య చేసి
యిది నిమిత్తము శూద్రుఁ డయ్యెను దదన్వ, యంబువారును శూద్రులై రతనియట్ల.[3]

20


క.

క్షితిపతి యైనకరూశుఁడు, సుతులం గారూశు లనఁగ సూనృతరతులన్
ధృతిబలపరాక్రమశ్రీ, యుతులం బెక్కండ్రం గాంచె నున్నతమతులన్.[4]

21


క.

మనుపుత్రుఁ డైనదిష్టుఁడు, గనియెను నాభాగుఁ డనఁగ గాదిలిసుతునిన్
విను మతనికి వైశ్యత్వం, బనుగుణమయ్యెను ధరిత్రి యంతయు నేలన్.[5]

22


వ.

ఇట్టినాభాగునకు బలంధనుండును బలంధనునకు వత్సప్రీతియును వత్సప్రీతికి
నుదారకీర్తియును ఉదారకీర్తికిఁ బ్రాంశుప్రజాపతియును వానికి ఖనిత్రుండును
వానికి క్షుపుండును క్షుపునకు నతిబలపరాక్రమనిధి యైన వింశుండును వానికి
ఖనేత్రుండును అతనికి నతివిభూతియును అతివిభూతికి నధికబలపరాక్రముం
డైనకరంధముండును వానికి నవేక్షియును అవేక్షికి మరుత్తుం డనుచక్రవర్తియుం
బుట్టిరి.

23


మ.

మనువంశోత్తముఁ డమ్మరుత్తుఁడు జగన్మాన్యుండు భూలోకమె

  1. ప్రసూనశిలీముఖుచేతన్ = మన్మథునిచేత.
  2. అధిష్ఠానము = ఉనికిపట్టు.
  3. తదన్వయంబువారు = వానివంశస్థులు.
  4. సూనృతరతులన్ = నిజము చెప్పుటయందు ఆసక్తులైన వారిని, ధృతిబలపరాక్రమశ్రీయుతులన్ = ధైర్యముతోను బలముతోను పరాక్రమముతోను సంపదతోను కూడుకొన్నవారిని.
  5. గాదిలి = ప్రియమైన.